/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
Donald Trump : ఇన్నాళ్లు వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వీసాలపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చాడు.హెచ్-1బీ వీసా (H-1B visa) ఉద్యోగులను ఉద్దేశిస్తూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు చాలాఉందని అంగీకరించారు. ఈ విషయాన్ని ‘మాగా’ మద్దతుదారులు అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అమెరికా- సౌదీ పెట్టుబడుల ఫోరమ్‌లో మాట్లాడుతూ.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనర్హం. కాగా అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇవి దేశ ఆర్థికవృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ ప్లాంట్లలో పనిచేసేందుకు విదేశీ నైపుణ్యం కలిగిన వారిని తీసుకురావాల్సి ఉందన్నారు. వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలన్నారు.
అమెరికలోని కంపెనీల్లో బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి స్థానిక నిరుద్యోగులను నియమించుకొని.. నిపుణులు లేకపోతే విజయం సాధించలేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి ఆ తర్వాత తిరిగి స్వదేశాలకు వెళ్లొచ్చన్నారు. అరిజోనాలో బిలియన్ డాలర్లతో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీ తెరిచి.. దాన్ని నడిపేందుకు నిరుద్యోగులను తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. విదేశీ వృత్తి నిపుణులు తమ వెంట వేలాది మందిని తీసుకురావాలని.. వారిని తాను స్వాగతిస్తానని ట్రంప్ చెప్పారు. యూఎస్‌లో అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల అవసరం చాలా ఉందని వ్యాఖ్యానించారు. ఇది మాగా సభ్యులకు అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. విదేశీ ఉద్యోగులను అనుమతించకపోతే మనం విజయం సాధించలేమని ట్రంప్ స్పష్టం చేశారు.
కాగా, ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీని ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విదేశీ వృత్తి నిపుణుల కారణంగా అమెరికన్లకు ఉద్యోగావకాశాలు లభించడం లేదని మొన్నటివరకు ట్రంప్ వాదిస్తూ వచ్చారు. అయితే, దీనిపై ఇటీవల ఆయన స్వరం మార్చాడం విశేషం. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని ట్రంప్ సమర్థించారు. ప్రపంచంలోని ప్రతిభావంతులను అమెరికాకు తీసుకువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగుల అవసరం తమకు ఉందని.. వారు యూఎస్‌కు వచ్చి స్థానికులకు నైపుణ్యాలు నేర్పించి వెళ్లాలంటూ సూచించారు. అయితే, ట్రంప్ నిర్ణయాలను మాగా సభ్యులు వ్యతిరేకించడం గమనర్హం.
Follow Us