/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
airlines
Indians flights : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఆయా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడులకు దిగడంతో ఇరాన్ కూడా ప్రతీదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ పై ఇరాన్ దాడులకు దిగింది.ఈ క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్‌లు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ క్రమంలో ఈ రోజు ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిరిండియా విమానం వెనక్కి తిరిగివచ్చింది. అనంతరం పశ్చిమాసియా దేశాలకు వెళ్లే విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మరో దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో కూడా పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని ఆయా విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. కాగా ఆయా దేశాల్లో నిరంతరం పరిస్థితులు మారుతుండడంతో ప్రయాణికులకు కావాల్సిన సర్దుబాట్లు చేయడానికి తమ సిబ్బంది కృషి చేస్తున్నారని ఇండిగో వెల్లడించింది.
అదే సమయంలో పశ్చిమాసియాలో అస్థిరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాలకు అంతరాయాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు హెచ్చరించింది. ఇదిలా ఉండగానే ఇరాన్, ఇజ్రాయెల్‌లకు వెళ్లాల్సిన తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు జర్మనీ, రష్యా, ఫ్రాన్స్‌లతో పాటు పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. పశ్చిమాసియ దేశాలకు వెళ్లాల్సిన విమానాలను తాత్కాళికంగా రద్దు చేసినట్లు వెల్లడించాయి.
Follow Us