రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోకి నార్త్ కొరియా బలగాలు–ధృవీకరించిన​ అమెరికా

మరికొద్ది రోజుల్లోనే నార్త్ కొరియా సైన్యం రష్యా‌‌ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగనుందని కన్ఫామ్ చేసింది అమెరికా. అక్కడి నుంచి 8 వేల నుంచి 10 వేల మంది దాకా సైనికులు రష్యాలో శిక్షణ పొందుతున్నారని చెప్పింది. 

11
New Update

North Korea In Russia-Ukrain War: 

దాదాపు ఏడాదిన్నర అవుతోంది...కానీ రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. రష్యా ఎన్ని ఏళ్ళయినా తగ్గేదే లేదు అంటోంది. ఉక్రెయిన్ కూడా ధీటుగానే జవాబు ఇస్తోంది. అయితే ఉక్రెయిన్‌ను ఎలా అయినా ఓడించాలని పట్టుబట్టింది రష్యా. దీని కోసం అదనపు బలగాలను సమకూర్చుకుంటోంది. తాజాగా ఉత్తర కొరియా  నుంచి పెద్ద మొత్తం బలగాలను రప్పించుకుంది. ఈ విషయమై ఐక్యరాజ్య సమితిలో కూడా గొడవ అయింది. ఇప్పుడు తాజాగా అమెరికా వైట్ హౌస్ ఉన్నతాధికారులు కూడా ఉత్తర కొరియా బలగాలు రష్యాకు సాయంగా వెళ్ళాయని ధృవీకరించారు. మొత్తం 8 నుంచి 10 వేల మంది సైనికులు రష్యా చేరుకున్నారని చెప్పింది. వీరు ఇంతకు ముందే మాస్కోకు వెళ్ళారని...అక్కడ వారికి యుద్ధానికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు. ఉత్తర కొరియా బలగాలు మరికొద్ది రోజుల్లో యుద్ధంలోకి దిగతాయని స్పష్టం చేశారు.  దీంతో పాటూ ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా 13వేల ఆయుధాలను రష్యా పంపిందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్‌!

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా మరింత సపోర్ట్‌ను అందిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రెండు సంవత్సరాలకు పైగా పూర్తి స్థాయి యుద్ధంలో రష్యన్ దళాలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు ఉత్తర కొరియా సైన్యానికి కూడా అదే గతి పట్టబోతోందని అంటున్నారు అమెరికా అధికారులు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సాక్షిగానే హెచ్చరించామని తెలిపారు. 

రెండు రోజుల క్రితం ఉత్తర కొరియా యుద్ధంలోకి వెళ్ళడంపై ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగింది. ఇందులో అమెరికా, ఉత్తర కొరియా అంబాసిడర్ల మధ్య మాట యుద్ధం జరిగింది. ఒకటి, రెండు సార్లు ఆలోచించి బరిలోకి దిగాలంటూ అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్డ్ వుడ్ అన్నారు. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. వారి బాడీలు బ్యాగ్‌లలో తిరిగివెళ్తాయని హెచ్చరించారు. దీనికి సమాధానంగా ఉక్రెయిన్‌కు మిగతా అన్ని దేశాలు సాయం వెళుతున్నప్పుడు రష్యాకు ఉత్తర కొరియా వంటి మిత్రదేశాలు సహాయం అందించకూడదా అంటూ ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ప్రశ్నించారు. అలాగే అమెరికా, పాశ్చాత్య దేశాలు..రష్యా సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు బహిర్గతం చేయడం, బెదిరింపులకు పాల్పడితే.. మేము వాటికి సమాధానం ఇస్తామని ఉత్తర కొరియా రాయబారి అన్నారు. పోంగ్యాంగ్‌, మాస్కో పరస్పర భద్రత, అభివృద్ధిపై సన్నిహిత సంబంధాన్ని కలిగిఉన్నాయని చెప్పారు. 

Also Read: National: ఈసీకి స్వతంత్రత లేదు–‌‌కాంగ్రెస్ లేఖ

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe