అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై మొదటి నుంచి అందరిలోనూ ఉత్కంఠ ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు అందరికీ అర్థం అయిపోయాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా తెలిసిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఎంగోంగా లిస్ట్ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్ అధికారి భార్య
అదే సమయంలో డెమొక్రాట్ కమలా హారీస్ వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. కాగా అమెరికా అధ్యక్షుడు కావడానికి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 270 ఓట్లు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ట్రంప్ 247, హారిస్ 210 ఆధిక్యంలో ఉన్నారు. అందులో ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ దాదాపు ఐదింటిలో ముందంజలో ఉన్నారు.
Also Read: ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే!
ట్రంప్ గెలుపు ఖాయం
దీంతో ట్రంప్ గెలుపు ఖాయమనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ వేడుకకు సన్నాహాలు కూడా మొదలైపోయాయి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్‌లో వియోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ వేడుకకు ట్రంప్ ఏ సమయంలోనైనా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పార్టీలో ఎలాన్ మస్క్, రాబర్ట్ కెన్నెడీ కూడా హాజరుకానున్నారు.
Also Read: ఇల్లినాయిస్‌లో భారతీయుడు రాజా కృష్ణమూర్తి విజయం!
కమలా హారీస్ ప్రసంగం రద్దు
మరోవైపు కమలా హారీస్ మద్దతుదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఇందులో భాగంగానే కమలా హారిస్ ప్రసంగం వాషింగ్టన్‌లోని హూవార్డ్ యూనివర్సిటీలో జరగాల్సి ఉంది. కానీ కమలా హారిస్ మాత్రం ఆ ప్రసంగానికి హాజరుకాకుండా తిరిగొచ్చేశారు. దీనిపై కమలా హారిస్ సహచరుడు సెడ్రిక్ రిచ్‌మండ్ హూవార్డ్ వద్ద మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా చాలా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉందని.. అందుకే ఇవాళ కమలా హారిస్ ప్రసంగం లేదని క్లారిటీ ఇచ్చారు.