US President: 248 ఏళ్ల చరిత్రలో.. ఆమెకు అమెరికా అందని ద్రాక్షే!

248 ఏళ్ల దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠం మహిళలకు అందని ద్రాక్షగానే మిగులుతోంది. మార్గరేట్‌ చేస్‌ స్మిత్‌ నుంచి నేడు కమలా హారిస్‌ వరకూ అగ్రరాజ్యం అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలోనే నిలిచిపోయారు. ఆసక్తికర స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ చదివేయండి.

dd
New Update

US President: 248 ఏళ్ల దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠం మహిళలకు అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఇప్పటి వరకు ఎంతోమంది బరిలో నిలిచినప్పటకీ అగ్ర రాజ్యంలో ఒక స్త్రీ ప్రెసిడెంట్‌ కాలేకపోయింది. రాజకీయ చైతన్యం పెంచుకుని చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అధ్యక్ష పీఠానికి మాత్రం అడుగు దూరంలోనే నిలిచిపోతున్నారు. ప్రస్తుతం భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ సైతం డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. గతంలో మార్గరేట్‌ చేస్‌ స్మిత్‌, షెల్లీ చిసమ్‌ అధ్యక్ష పదవికి పోటీ పడగా.. హిల్లరీ క్లింటన్‌, కమలా హారిస్‌ ఎన్నికల్లోనూ బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 2008, 2016లో హిల్లరీ క్లింటన్‌ అధ్యక్ష పీఠానికి దరిదాపుల్లోకి వచ్చినట్లే వచ్చి తృటిలో మిస్ అయ్యారు.

ఏళ్ల పోరాటం తర్వాత..

ఈ మేరకు1920లో అమెరికా మహిళలకు ఓటు హక్కు లభించినా అది కొందరికే పరిమితమైంది. ఏళ్ల పోరాటం తర్వాత 1960ల్లో అన్ని వర్గాల మహిళలకు అగ్ర రాజ్యంలో ఓటు హక్కు దక్కింది. ఈ నేపథ్యంలో 1964లో మార్గరేట్‌ చేస్‌ స్మిత్‌ అనే స్త్రీ రిపబ్లికన్‌ పార్టీ తరఫున తొలిసారి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. కానీ ఆమెకు అభ్యర్థిత్వమే దక్కలేదు. ఇక 1968లో షెల్లీ చిసమ్‌ తొలి నల్లజాతి మహిళా సెనెటర్‌గా ఎన్నికయ్యారు. 1972లో ఆమె డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్నట్లు ప్రకటించినా.. ఊహించని పరిణామాల మధ్య ఆమెకు అధికార పీఠం దక్కలేదు. ఆ తర్వాత 1984లో డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున గెరాల్డిన్‌ ఫెరారో తొలిసారి అధ్యక్ష పిఠానికి పోటీపడ్డారు. కానీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. 

ఇది కూడా చదవండి: Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!

అడుగు దూరంలోనే ఆగిపోయిన కమల..

ఇక ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన కమలా హారిస్‌కు ట్రంప్‌నకు ధీటుగా పోటీపడ్డారు. పోలింగ్ కు ఒకరోజు ముందు ముందంజలో ఉన్నట్లు కనిపించిన కమల.. పాపులర్‌, ఎలక్టోరల్‌ ఓట్లలో వెనుకబడిపోయింది. దీంతో అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. 2016 నాటి ఫలితాలకు భిన్నంగా ఈసారి పాపులర్‌ ఓటు కూడా ట్రంప్‌కే లభించింది. ట్రంప్ కు 51 శాతానికి పైగా ఓట్లు లభించగా.. హారిస్‌ 47 శాతం ఓట్లు పడ్డాయి. విస్కాన్సిన్‌లో గెలుపుతో మేజిక్‌ ఫిగర్‌ (270)ను దాటి 277 ఎలక్టోరల్‌ ఓట్లతో జయకేతనం ఎగురవేశారు ట్రంప్. ఇంకా మూడు రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇంకా 30కు పైగా ఎలక్టోరల్‌ ఓట్లు దక్కే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: TG News: మేఘాకు బిగ్ షాక్.. ఆ రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు!

#america election #kamalaa harris
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe