US Fed : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి. అంతకు ముందు 5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి.
ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం వైపు కదులుతున్నట్లు కమిటీ తెలిపింది. దీంతో ఉపాధి, ద్రవ్యోల్బణం లక్ష్యాలు సాధించడంలో సమతుల్యత ఉన్నట్లు సమాచారం. అని ఫెడ్ రేటు నిర్థారణ కమిటీ రూపకర్తలు పేర్కొన్నారు.
రెండు నెలల్లో అమెరికా ఎన్నికలు ఉండడంతో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కీలకంగా మారింది. బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే వినియోగదారుల నుంచి మొదలు వ్యాపారస్తుల వరకు ప్రతి రంగం పై ప్రభావం పడనుంది. 2025 లోనూ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండనున్నట్లు సమాచారం.
ఫెడ్ సంచలన నిర్ణయంతో అమెరికాలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఔన్స్ బంగారం ధర 2600 డాలర్లకు చేరింది.24 క్యారెట్ల గ్రాము బంగారం రూ.7680కి చేరింది. వడ్డీరేట్లు తగ్గడంతో బంగారంవైపు ఇన్వెస్టర్ల మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం రూ.7,473 దగ్గర బంగారం రేటు ఉండగా.. వడ్డీరేట్ల తగ్గింపుతో పెరిగిన బంగారం ధర.
Also Read: ELECTRICITY CHARGES: మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు!