Us Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో విజయాన్ని అందుకున్నారు. ఇల్లినాయిస్ లో 8 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరుఫన పోటీ చేసి గెలిచారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ పై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.
Also Read: దూసుకుపోతున్న ట్రంప్.. 17 రాష్ట్రాల్లో ..188 ఎలక్ట్రోరల్ ఓట్లతో!
2016లో తొలిసారి ఆయన అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. సెలక్ట్ కమిటీ ఆన్ చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా పని చేశారు. హార్వర్డ్ విశ్వవిద్ఆయలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినాయిస్ లో పలు పదవులు నిర్వహించారు. స్టేట్ ట్రెజరర్ గా కూడా ఆయన సేవలు అందించారు.
Also Read: 9 రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్న ట్రంప్!
మరోపక్క ఇల్లినాయిస్ లో డెమోక్రటిక్ పార్టీ హవా కొనసాగుతుంది. మొదటి నుంచి కమలకు బలమైన అండగా నిలిచింది. దీనిలో ఆమె విజయం సాధించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
Also Read: అమెరికా ఎన్నికలు..ఆ రెండు రాష్ట్రాల్లో ట్రంప్ దే విజయం!
ఈ రాష్ట్రం నుంచి మొత్తం 14 ఎలక్టోరల్ ఓట్లు కమలకు లభించబోతున్నట్లు సమాచారం. ఇక్కడ ట్రంప్ నకు 14,66, 112 ఓట్లు రాగా...కమలా కు 19,98,342 ఓట్లు వచ్చినట్లు సమాచారం.
Also Read: ఓటేసిన అమెరికా...అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్!
ఇప్పటి వరకు ట్రంప్ కి 214 ఎలక్టోరల్ సీట్లు లభించగా...కమలాకి 179 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు.
బెదిరింపులు..
అక్కడక్కడ సాంకేతిక సమస్యలు, బ్యాలెట్ ప్రింటింగ్‌లో లోపాలు, వాతావరణ వల్ల సమస్యలు, బూటకపు బెదిరింపులు వంటి ఘటనలు ఎదురైనప్పటికీ..ఎక్కువ సేపు నిలబడలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పోలింగ్ పర్యవేక్షకులను కొన్ని ఎన్నికల కేంద్రాల్లో అనుమతించలేదనే వార్తలు వచ్చాయి.
అయితే సమస్య వెంటనే పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇకడ కొన్ని బ్యాలెట్ యంత్రాలలో కూడా సమస్యలు వచ్చాయి. దాంతో ఇక్కడ పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించారు. ఇల్లినాయిస్‌లో ఛాంపియన్ కౌంటీలో సాంకేతిక లోపాలు, కెంటకీలోని లూయీవిల్‌లో ఈ-పోల్‌బుక్‌లతో సమస్యల వలన పోలంగ్ ప్రక్రియ్ కాస్త ఆలస్యమైంది.