AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలపై అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టినందుకే ఇతనిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవీందర్ రెడ్డిని కడప పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. By Manogna alamuru 05 Nov 2024 | నవీకరించబడింది పై 05 Nov 2024 23:26 IST in విజయవాడ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి YSP Social Media activist Arrest: నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీందర్ రెడ్డి సొంత ఊరు పులివెందుల. ఇతను ఒకప్పుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడని సమాచారం. వర్రా రవీందర్ రెడ్డిని పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప పీఎస్ కు తీసుకువచ్చారు. వర్రా రవీందర్ రెడ్డి గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. అంతేకాదు, షర్మిల, విజయమ్మపైనా అతడు అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం కూడా బయటకు వచ్చింది. రవీందర్ రెడ్డిపై పులివెందుల, మంగళగిరి, హైదరాబాదులో పలు కేసులు ఉన్నాయి. Also Read: AP: మెగా డిఎస్సీ కి పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి