Lebanan: లెబనాన్‌లోని ఐరాస కార్యాలయం పై దాడి..ఖండించిన భారత్‌!

లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ రాకెట్లు బీరూట్‌ను తాకినప్పుడు ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో పడ్డాయి.ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్ర పరిణామంగా పరిగణించింది. తమ ఆస్తుల భద్రతకు హామీ ఇవ్వాలని యూఎన్ సిబ్బంది కోరారు.

New Update
lebanan

Israel: ఇజ్రాయెల్‌ లెబనాన్‌ పై భీకరదాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. వరుసపెట్టి ఐడీఎఫ్‌ దళాలు దాడులకు దిగుతున్నాయి.  తాజాగా లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు జరిగాయి.  ఈ ఘటనలో ఇద్దరు పరిరక్షకులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ రాకెట్లు బీరూట్‌ను తాకినప్పుడు యూఎన్ కార్యాలయం సమీపంలో పడ్డాయి. 

Also Read: బొగ్గుగనిలో దుండగుడి కాల్పులు...20 మంది మృతి!

ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్ర పరిణామంగా పరిగణించింది. తమ ఆస్తుల భద్రతకు హామీ ఇవ్వాలని యూఎన్ సిబ్బంది కోరారు.దక్షిణ లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ కార్యాలయంపై దాడులు జరగడం ఆందోళనకరమని భారత విదేశాంగశాఖ తెలిపింది. ‘‘లెబనాన్‌ సరిహద్దులో భద్రతా పరిస్థితులు క్షీణించడం ఆందోళనకరమని పేర్కొంది. 

Also Red: బూమ్ బూమ్ బూమ్రాకు కొత్త బాధ్యతలు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. ఐరాస ప్రాంగణాలను అందరూ గౌరవించాలి. ఐరాస శాంతి పరిరక్షకులు, ఆ సంస్థ నిర్ణయాలను గౌరవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన లో తెలిపింది.

Also Red: సురక్షితంగా ల్యాండ్‌ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్

‘‘పశ్చిమాసియాలో నెలకొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశాం. అక్కడ చోటుచేసుకుంటున్న హింస, పరిస్థితులు ఎంతగానో ఆందోళన కలిగిస్తున్నాయి. సంబంధిత భాగస్వామ్యపక్షాలు సంయమనం పాటించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని తెలిపాం. 

Also Read: ఎట్టకేలకు మహదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్, మాస్టర్ మైండ్ సౌరభ్ అరెస్ట్

ఈ ఘర్షణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకూడదు. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ అన్నారు.

Also Read: చెన్నైలో ట్రైన్ యాక్సిడెంట్..ఢీ కొట్టుకున్న గూడ్స్, ఎక్స్‌ప్రెస్

Advertisment
తాజా కథనాలు