Pakistan: : బొగ్గుగనిలో దుండగుడి కాల్పులు...20 మంది మృతి!

దాయాది దేశం పాక్‌ లో తాజాగా మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 20 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు..నలుగురు మృతి..!!

Pakistan: నిత్యం ఏదోక హింసాత్మక ఘటనలు, ఉగ్రదాడులు, దుండగుల కాల్పులతో మారుమోగే దాయాది దేశం పాక్‌(Pakistan)  లో తాజాగా మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బొగ్గు గనిలోకి తుపాకీతో ప్రవేశించిన ఓ దుండగుడు.. కనిపించినవారిని కనిపించినట్లు కాల్చి చంపాడు.

Also Read: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్ రిలీజ్

ఆ కాల్పుల్లో బొగ్గు గనిలో (Coal Mines) పనిచేసే 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

Also Read: స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం.. దరఖాస్తులకు ఆహ్వానం

ఇక చనిపోయిన వారిలో, గాయపడిన వారిలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని దికీ జిల్లాలో ఉన్న ఓ బొగ్గు గనిలో పనిచేసే ఉద్యోగుల క్వార్టర్స్‌లోకి ఓ వ్యక్తి ఆయుధంతో  ప్రవేశించాడు.

Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ

బొగ్గు గనిలో ఉన్న ఉద్యోగులను చుట్టుముట్టి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అక్కడ ఉన్న ఉద్యోగులు 20 మంది మృతిచెందారు. 

Also Read: బూమ్ బూమ్ బూమ్రాకు కొత్త బాధ్యతలు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించినవారిలో ఎక్కువమంది బలూచిస్థాన్‌లోని పష్తున్‌ ప్రాంతానికి చెందినవారే అని పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్గనిస్థాన్‌కు చెందిన పౌరులు ఉన్నారని  పోలీసులు గుర్తించారు. 

Also Read: చెన్నైలో ట్రైన్ యాక్సిడెంట్..ఢీ కొట్టుకున్న గూడ్స్, ఎక్స్‌ప్రెస్

వచ్చే వారం ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. దీంతో తాజాగా జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ సమావేశానికి భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ హాజరు అవుతున్నారు.

Also Read: తెలంగాణ ఆరోగ్యశాఖలో జాబ్స్...371 నర్సింగ్ పోస్టులు

Advertisment
Advertisment
తాజా కథనాలు