ఎట్టకేలకు మహదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్, మాస్టర్ మైండ్ సౌరభ్ అరెస్ట్

మహదేవ్ బెట్టింగ్ యాప్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.  ఈ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతూ..కోట్లు కూడబెట్టిన ఓనర్ సౌరభ్ చంద్రకర్‌‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇతనిని దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
mahadev

Mahadeva Betting App Owner Sourabh Chandrakar: 

మహదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్ యజమానుల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌‌ను దుబాయ్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఓనర్ రవిని చాలా రోజల క్రితమే వైజాగ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసుల ఆధారంగా దుబాయి పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. డాక్యుమెంటేషన్ పూర్తయ్యాక సౌరభ్‌ను భారత్‌కు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  వారం రోజుల్లోగా ఇతనని ఇండియాకు తీసుకురావచ్చని తెలుస్తోంది.  రవి, సౌరభ్‌లో ఛత్తీస్‌ఘడ్‌లో జ్యూస్ లు అమ్ముకుని, టైర్ షాపుల్లో పని చేసుకునే స్థాయి నుంచి దాదాపు 5వేల కోట్ల అధిపతులకా మారాఉ. ఇదంతా కేవలం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా చేసిన మనీ లాండరింగ్‌తోనే సాధ్యమయింది. 

అసలేంటీ యాప్...

మహదేవ బెట్టింగ్ యాప్ ను క్రియేట్ చేసిన సౌరభ్ చంద్రకర్ (Sourabh Chandrakar), రవి ఉప్పల్ (Ravi Uppal) ఇద్దరూ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాయ్ కు చెందిన వారు. యాప్ క్రియేట్ చేయకముందు సౌరభ్ జ్యూస్ షాప్ నిర్వహిస్తూ ఉండేవాడు. రవికి టైర్ షాప్ ఉండేది. వీరిద్దరికీ గ్యాంబ్లింగ్ అంటే చాలా ఇష్టమట. దానికి బానిసలైన తమ వ్యాపారాలను వదిలేసి దుబాయ్ కు వెళ్ళిపోయారు. అక్కడే వీళ్ళ జీవితాలు ఒక ములుపు తీసుకున్నాయి. రెండు, మూడు ఏళ్ళల్లో ఏకంగా 5వేల కోట్లు సంపాదించే రేంజ్ కు తీసుకువెళ్లిపోయింది.

దుబాయ్ లో సౌరభ్, రవిలకు క్ష షేక్, మరో పాకిస్తానీ యువకుడితో పరిచయం అయింది. వారి సాయంతోనే మహదేవ బెట్టింగ్ యాప్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత భారత్‌లో వీరి తరుఫున వ్యాపారాలు నిర్వహించేందుకు 4వేల మంది ప్యానెల్ ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు 200 మంది కస్టమర్లు ఉన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రోజుకు 200 కోట్ల రూపాయిలు చేతులు మారతాయి. ఈ డబ్బులతోనే సౌరభ్, రవిలు దుబాయ్ లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగారు. మహదేవ్ ఆన్‌లైన్ బుక్‌ను 70:30 లాభ నిష్పత్తి ప్రకారం యూఏఈలోని కార్యాలయం నుంచి ఫ్రాంఛైజీ ద్వారా నడిపారు. వినియోగదారులను ఆకర్షించడానికి, యాప్, వెబ్ సైట్ ప్రచారానికి భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు చేశారు. దీనికి కోసమే బాలీవుడ్ నటులు రణబీర్ (Ranbir Kapoor), శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor) లాంటి వారితో ప్రచారం చేయించారు. అలాగే వాళ్ళ కార్యక్రమాల్లో యాప్‌కు సంబంధించి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇవి చేసినందుకు బాలీవుడ్ యాక్టర్స్ కు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మహదేవ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు 72 కేసులు నమోదు చేయగా.. ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాలలో 449 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఆ తరువాత ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్ళింది. కొత్త వినియోగదారులను చేర్చుకొని యూజర్ ఐడీలను క్రియేట్‌చేసి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బులను మళ్లించేందుకు మహాదేవ్ బుక్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందనేది ఈడీ ప్రధాన ఆరోపణ. బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని హవాలా ద్వారా ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలిస్తోందని ఈడీ తెలిపింది.

Also Read: Tiruchi: ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం

Advertisment
Advertisment
తాజా కథనాలు