బూమ్ బూమ్ బూమ్రాకు కొత్త బాధ్యతలు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఆడుతున్న టీమ్ ఇండియా క్రికెట్ జట్టు...దీని తరువాత న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీనికి సంబంధించి 15 మంది కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్ కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
IND vs AFG: బూమ్‌ బూమ్‌ బుమ్రా.. భలే వేశాడు భయ్యా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Team India For New Zealand Sereies: 

అక్టోబర్ 17 నుంచి రోహిత్ శర్మ సేన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఆడుతోంది. వీరితో ఇంకో టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. వెంటనే న్యూజిలాండ్‌తో టెస్ట్ సీరీస్ మొదలయిపోతుంది. ఈ మ్యాచ్‌లు కూడా భారతదేశంలోనే జరగనున్నాయి. టీమ్ ఇండియా, న్యూజిలాండ్‌తో మొదట టెస్ట్ సీరీస్‌లను ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ ల టెస్ట్ సీరీస్‌కు బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే టీమ్‌ను ప్రకటించింది. ఇందులో ఈసారి జట్టుకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా నియమించిండం విశేషంగా మారింది. ఇప్పటికే వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న జట్టు...రోహిత్, బుమ్రాల సారథ్యంలో మరిన్ని విక్టరీలు సాధిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. 

 భారత జట్టు...

రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్

Also Read: చెన్నైలో ట్రైన్ యాక్సిడెంట్..ఢీ కొట్టుకున్న గూడ్స్, ఎక్స్‌ప్రెస్

Advertisment
తాజా కథనాలు