/rtv/media/media_files/2025/05/10/YB7zekpzJhZUmVuMsxqo.jpg)
WAR END
India-Pakistan Ceasefire: అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామని తెలిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయంటూ ట్వీట్ చేశారు. అలాగే భారత్-పాకిస్థాన్‌కు అభినందనలు తెలిపారు. భారత్-పాకిస్థాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు తెలిపాయి.
ఇండియా - పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ సంచలనం
— RTV (@RTVnewsnetwork) May 10, 2025
కాల్పుల విరమణకు ఇండియా, పాకిస్తాన్ అంగీకరించాయన్న ట్రంప్
రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించాం
సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్
రెండు దేశాలకు అభినందనలు
- ట్రంప్@realDonaldTrump #IndiaPakistanWar… pic.twitter.com/xxMW4BnTTF
భారత్-పాక్ కాల్పుల విరమణ
ట్రంప్ పోస్టు చేసిన కొద్దిసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు మోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్‌తో తాము మాట్లాడినట్లు పేర్కొన్నారు.
telugu-news | national-news