భారత్‌కు ధీటుగా స్పందిస్తాం.. పన్ను విషయంలో తగ్గేదేలేదంటున్న ట్రంప్!

పన్నుల విషయంలో భారత్‌కు ధీటుగా స్పందిస్తామని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ప్రొడక్ట్స్‌పై ఇండియా, బ్రెజిల్‌ వంటి దేశాలు భారీ టారిఫ్‌లు విధిస్తున్నాయని చెప్పారు. దేనికైనా చర్యకు ప్రతిచర్య ఉండటంలో తప్పేమి లేదన్నారు.

New Update
Trump

TRUMP: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌తో పన్నుల అంశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ భారీ టారిఫ్‌లు వసూలు చేస్తోందన్నారు. అందుకే తాము కూడా ప్రతీకార పన్ను తీర్చుకుంటామంటూ హెచ్చరించారు. బుధవారం ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా ప్రొడక్ట్స్ పై భారత్‌ తోపాటు బ్రెజిల్‌ వంటి దేశాలు అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని చెప్పారు.

దేనికైనా ప్రతిచర్య ఉంటుంది..

ఈ మేరకు ట్రంప్ మాట్లడుతూ.. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. పలు దేశాలు మా ఉత్పత్తులపై 100, 200శాతం పన్నులు విధిస్తున్నాయి. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో స్పందిస్తాం. భారత్‌ 100శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్‌ చేయడంలో తప్పేమి లేదు. ఆయా దేశాలు పన్ను వసూలుచేయడం వారి ఇష్టమే అయినప్పటికీ మాకు కూడా ఆ హక్కు ఉంటుందని గుర్తించాలని సూచించారు. దీంతో మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశమవగా గతంలోనూ ట్రంప్ పలుసార్లు పన్నులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవలే అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తామని గతంలోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. 

ఇది కూడా చదవండి: అంబేడ్కర్ పేరెత్తితే నేరస్థుడికి వణుకుపుడుతోంది.. అమిత్ షాపై అద్దంకి!

ఇదిలా ఉంటే.. గతంలోనూ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్.. 2019లో ఇండియాను ‘టారిఫ్‌ కింగ్‌’గా పేర్నొన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు జీఎస్‌పీ రద్దు చేశారు. అయితే ఈ హోదాను పునరుద్ధరించేందుకు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు