TG: అంబేడ్కర్‌ను అవమానించిన హోమంత్రి అమిత్ షాకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. నేర చరిత్ర కలిగిన అమిత్ షాకు బాబాసాహెబ్ పేరు ఎత్తితేనే వణుకుపుడుతోందన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అంబేడ్కర్ భావాజాలన్ని రూపుమాపేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. - అద్దంకి దయాకర్@INCIndia @ADayakarINC #Telangana #addankidayakar #comments #AmitShahInRajyaSabha #DrBRAmbedkar #RTV pic.twitter.com/Wvg9qTO9II — RTV (@RTVnewsnetwork) December 18, 2024 పుట్టగతులుండవు.. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసిన దయాకర్.. నిండుసభలో కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి అంబేడ్కర్ ను అవమానించడం దేశానికే అవమానం అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారు వారు ఎవరు ఇలా మాట్లాడరని విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ కు బదులు దేవుని పేరు ఎత్తాలని సూచిస్తున్న అమిత్ షా.. ఆ భగవాన్ అంటే ఏ దేవుడో పేరు చెప్పాలన్నారు. ఇక రాజ్యాంగాన్ని, బాబా సాహెబ్ ను కించపరిచే వారికి దేశంలో పుట్టగతులుండవని, రాజ్యాంగానికి పుట్టిన అమిత్ షా ఈ రోజు అంబేడ్కర్ నే కించపరిచే స్థాయికి దిగజారిపోయారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత, పిత అయిన బాబా సాహెబ్ ను కించపరిచే వ్యక్తులు కేంద్రమంత్రి స్థాయిలో ఉండటం దారుణమని, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు అంబేడ్కర్ సిద్ధాంతం నచ్చదన్నారు. బడుగు, బలహీన వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకు అబద్ధాలు చెబుతారని అన్నారు. అంబేడ్కర్ పేరు ఎత్తితే నీకేంటి నొప్పి అంటూ అమిషాపై ఫైర్ అయ్యారు. అమిత్ షా ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే.. అంబేడ్కర్ వివాదంలో తనపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కలలో కూడా అంబేడ్కర్‌ను అవమానించలేదన్నారు. కాంగ్రెస్ అంబేడ్కర్ సిద్ధాంతాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకి అన్నారు. నెహ్రూ అంబేడ్కర్‌ను ద్వేషించేవారని, ఏనాడు అంబేడ్కర్‌ను గౌరవించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ వ్యతిరేక పార్టీ, రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని బీజేపీ వక్తలు చెప్పడం వల్లే ఇలా జరిగిందని హోంమంత్రి అన్నారు. కాంగ్రెస్ సావర్కర్‌ను అవమానించింది. ఎమర్జెన్సీ విధించడం ద్వారా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. భారత బలగాలను కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్ దేశ భూమిని ఇచ్చింది. ఇది పార్లమెంటులో రుజువయ్యాక కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ వ్యతిరేకి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేకం. సైన్యంలోని అమరవీరులను కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్ సావర్కర్ వ్యతిరేకి. కాంగ్రెస్ బాబా సాహెబ్‌కు గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు.