BIG BREAKING: వెనిజులాని ఆక్రమించుకున్న ట్రంప్

వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించినట్లు అధ్యక్షుడు ట్రంప్ శనివారం తెలిపాడు. ఈ ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యని అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని, దేశం దాటించినట్లు ట్రంప్ ప్రకటించారు.

New Update
trump

BIG BREAKING

BIG BREAKING: అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించాడు. ఈ ఆపరేషన్‌లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని, దేశం దాటించినట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు.

"అమెరికా సైన్యం వెనిజులాపై విజయవంతంగా భారీ దాడులు నిర్వహించింది. వెనిజులా నియంత నికోలస్ మదురో, అతని భార్యను మా దళాలు పట్టుకున్నాయి. వారిని ప్రస్తుతం వెనిజులా నుంచి తరలించడం జరిగింది" అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సహకారంతో ఈ ఆపరేషన్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిణామంపై మరిన్ని వివరాలను ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో నిర్వహించబోయే మీడియా సమావేశంలో వెల్లడిస్తామని తెలిపారు.

Also Read:'రాజాసాబ్' క్రేజీ అప్​డేట్.. 'నాచే నాచే' మాస్ సాంగ్ వచ్చేస్తోంది..!

శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కరాకస్‌లో కనీసం ఏడు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ప్రధాన సైనిక స్థావరాలైన లా కార్లోటా, ఫ్యూర్టే టియునా ప్రాంతాల నుంచి దట్టమైన పొగలు వెలువడటం కనిపించింది. ఈ దాడుల నేపథ్యంలో వెనిజులా ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి 'సామ్రాజ్యవాద దాడి'ని నిరసించాలని పిలుపునిచ్చింది

Also Read:‘ది రాజా సాబ్’ ప్రభాస్ జోకర్ లుక్ పై డైరెక్టర్ మారుతి షాకింగ్ ట్విస్ట్..

గత ఐదు నెలలుగా వెనిజులాపై అమెరికా తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. మదురో ప్రభుత్వం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోందని ట్రంప్ పరిపాలన వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కరాకస్ గగనతలాన్ని అమెరికా ఇప్పటికే మూసివేయగా, ఇప్పుడు నేరుగా సైనిక చర్యకు దిగడం గమనార్హం. ఈ పరిణామంతో దక్షిణ అమెరికాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Advertisment
తాజా కథనాలు