/rtv/media/media_files/2026/01/03/raja-saab-songs-2026-01-03-13-45-32.jpg)
Raja Saab Songs
Raja Saab Songs: ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ హారర్ ఫాంటసీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటివరకు రెండు ట్రైలర్స్, మూడు పాటలు రిలీజ్ అయ్యాయి.
Happy New Year ❤️❤️
— The RajaSaab (@rajasaabmovie) December 31, 2025
Here’s a small sneak peek of the BLASTER track releasing soon 💥💥#TheRajaSaab
pic.twitter.com/uldIubFX4h
'నాచే నాచే' మాస్ సాంగ్.. Raja Saab Nache Nache Song
తాజాగా ఫ్యాన్స్ కోసం మరో ప్రత్యేక సాంగ్ విడుదలకు సిద్ధమైంది. జనవరి 5న రీలీజ్ కానున్న ఈ పాటలో ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు డ్యాన్స్ చేయనున్నారు. ఈ సాంగ్ 1993 లో వచ్చిన హిందీ సూపర్ హిట్ ‘డిస్కో డాన్సర్’ సినిమాలోని ‘కోయి యహా నచే నచే’ సాంగ్ రీమిక్స్. ఒరిజినల్ పాటని బప్పీ లహిరి కంపోజ్ చేశారు, మిథున్ చక్రబర్తీ ఆ పాటలో నటించారు. ఈ రీమిక్స్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేక స్టైల్ లో పనిచేసినట్టు తెలుస్తోంది.
ఈ నాచే నాచే సాంగ్ సినిమా ప్రధాన హైలైట్‌గా ఉండనుందని దర్శకులు, మ్యూజిక్ టీమ్ తెలిపుతున్నారు. ప్రభాస్, ముగ్గురు హీరోయిన్‌ల డ్యాన్స్ కలయిక ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అని మూవీ టీం చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచిగానే సాగుతున్నాయి.
తమన్ సోషల్ మీడియాలో తెలిపినట్టే, జనవరి 5న వచ్చే ఈ పాటతో సినిమా మీద హైప్ మరింత పెరగనుంది. ప్రభాస్ కొత్త లుక్, కాస్ట్యూమ్, స్టైల్ ప్రత్యేకంగా ఉంటాయని కూడా మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్ చేశారు. ఈ పాత సూపర్ హిట్ అయితే సినిమా బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
సినిమాను టిజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో. జరీనా వాహబ్, బొమాన్ ఇరాని, వీటీవీ గణేష్, సముత్తిరాకని, యోగి బాబు వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అన్ని కుదిరితే ఈ రీమిక్స్ సాంగ్ సినిమా విజయంలో ప్రధాన ఎలిమెంట్‌గా ఉండనుంది. ఫ్యాన్స్ ఇప్పటికే ట్రైలర్ లో చూపిన నాచే నాచే సాంగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరి 5న ఈ పాట విడుదలతో సినిమాకు మంచి ప్రమోషన్ లభించనుంది, ఈ పాటలోని డ్యాన్స్, మ్యూజిక్ , స్టైల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోనుంది.
Follow Us