Prabhas Raja Saab: ‘ది రాజా సాబ్’ ప్రభాస్ జోకర్ లుక్ పై డైరెక్టర్ మారుతి షాకింగ్ ట్విస్ట్..

‘ది రాజా సాబ్’ ట్రైలర్‌లో హైలైట్ అయినా ప్రభాస్ జోకర్ లుక్ పార్ట్ 1లో ఉండదని డైరెక్టర్ మారుతి స్పష్టం చేశారు, ఆ షాట్స్ పార్ట్ 2కి లీడ్ మాత్రమేనని చెప్పి షాకిచ్చారు. అభిమానులు మాత్రం ప్రభాస్ జోకర్ గెటప్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. జనవరి 9న రాజాసాబ్ విదుదల కానుంది.

New Update
Prabhas Raja Saab

Prabhas Raja Saab

Prabhas Raja Saab: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మారుతి దర్శకత్వంలోని ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన 2.0 ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది, ప్రత్యేకంగా ప్రభాస్ జోకర్ గెటప్‌లో కనిపించిన షాట్ అభిమానులను షాక్ చేసిందనే చెప్పాలి.

Prabhas Joker Getup In Rajasaab

ఇక అసలు విషయం ఏమిటంటే, ట్రైలర్‌లో హైలైట్‌గా చూపిన ఆ జోకర్ లుక్, పార్ట్ 1లో ఉండదని డైరెక్టర్ మారుతి ఇప్పటికే వెల్లడించారు. ఆయన తెలిపిన దాని ప్రకారం, ఆ షాట్స్ ‘ది రాజా సాబ్’ పార్ట్ 2కి లీడ్‌గా ఉంటాయి. “ట్రైలర్‌లో చూపించిన జోకర్ షాట్స్, పార్ట్ 1లో భాగం కాదు. పార్ట్ 2 కోసం ఒక ముఖ్యమైన సీన్‌కి సంబంధించినది. ప్రభాస్‌కి అది బాగా నచ్చింది. వెంటనే ఆ షాట్స్ షూట్ చేశాం. పార్ట్ 2లో అవి హైలైట్‌గా నిలుస్తాయి” అని ఆయన చెప్పాడు.

ఈ వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చాయి. ఎందుకంటే ట్రైలర్ చూసి హైప్‌ అయ్యిన జోకర్ అవతార్ అసలు మొదటి పార్ట్‌లో ఉండదని తెలిసి కొంత నిరాశ ఏర్పడినట్టు అభిమానులు అసలు ఆ షాట్స్ ఎందుకు పెట్టారు? కథలో వాటి ప్రాముఖ్యత ఏమిటి? వీటిని సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుండేది అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రభాస్ వివిధ రకాల పాత్రల్లో కనిపించాడు. ‘ఛక్రం’ వంటి చిత్రాల్లో చిన్న వయసు పిల్లలను నవ్వించే కామెడీ జోకర్‌గా నటించిన ఆయన, ఇప్పుడు ట్రైలర్‌లో సీరియస్, అగ్రెసివ్ షేడ్స్ ఉన్న జోకర్ లుక్‌లో హైలైట్ అయ్యాడు. ఈ కొత్త అవతార్, ఫ్యాన్స్‌కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

మరో విశేషం ఏమిటంటే, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నప్పటికీ, ఎలాంటి ఆలోచన లేకుండా ఈ పాత్ర చేయడం ఆయన డెడికేషన్, ఆయన కృషిని మరోసారి నిరూపిస్తోంది. ట్రైలర్‌లో చూపించిన జోకర్ షాట్స్ ద్వారా సినిమాపై సెన్సేషన్ ఏర్పడినప్పటికీ, పార్ట్ 1లో అవి లేకపోవడం, అభిమానుల్లో ‘ఎక్సైట్మెంట్ బ్రేక్’ని సృష్టించింది.

మారుతి మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో ప్రయత్నిస్తున్నందున, కొన్ని సీక్రెట్లు ప్రేక్షకులకు ముందే తెలిపినట్టు కూడా భావిస్తున్నారు. జనవరి 9న ‘ది రాజా సాబ్’ రిలీజ్‌య్యాక, ఆ జోకర్ అవతార్ నిజంగా ఎంత ప్రభావం చూపుతుందో, పార్ట్ 2లో అది ప్రధాన ఆకర్షణగా మారుతుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ షాక్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.

ట్రైలర్‌లోని జోకర్ లుక్ హైప్‌ని పెంచినప్పటికీ, నిజానికి అది మొదటి భాగంలో ఉండదు. ఈ సీక్రెట్‌ని డైరెక్టర్ ఇంటర్వూస్ లో చెప్పేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్‌గా మారింది. ముందే చెప్పకుంటే థియేటర్ లో చూసి త్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు