/rtv/media/media_files/2025/06/23/nobel-trump-2025-06-23-15-49-44.jpg)
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినందుకు ట్రంప్ అధికారికంగా నోబల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. నోబల్ పీస్ ప్రైస్ ప్రతినిధి బడ్డీ కార్టర్ మంగళవారం నామినేషన్ సమర్పించారు. 12 రోజులుగా తారా స్థాయికి చేరిన యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే ఆపారని ఆయన పాత్రను ప్రసంశించారు. ట్రంప్ చేసిన పని అసాధారణ, చారిత్రాత్మకమని కొనియాడారు. అయితే చాలామంది ఆయన్న విమర్శిస్తున్నారు. ప్రపంచంలో అన్నీ యుద్ధాలకు ట్రంపే కారణమని ఇరాన్, రష్యా నాయకులు ఆరోపిస్తున్నారు.
BREAKING: President Trump FORMALLY nominated for the Nobel Peace Prize. pic.twitter.com/3m4roMJpaL
— Ryan Fournier (@RyanAFournier) June 24, 2025
రెండోవ సారి అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య పాలనలో అనే మార్పులు తీసుకొచ్చారు. దిగుమతి సుంకాలు, వలసవాదంపై ఉక్కుపాదం, ట్రాన్స్‌జండర్లపై కఠినంగా వ్యవహరించడం వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం 12 రోజుల్లోనే ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఆపిన ట్రంప్, 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. అటు భారత్, పాక్ యుద్ధంలో కూడా అమెరికా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేసిందని చెప్పుకుంది.