/rtv/media/media_files/2024/11/20/fppzSv6TBBvGrVzYyiQE.jpg)
America: ట్రాన్స్ జెండర్లకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఉభయ సభల్లో ట్రంప్ భారీ మార్పులు చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ రిపబ్లికన్లు ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో విజయం సాధించిన డెమోక్రటిక్ సభ్యురాలు, ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ పై రిపబ్లికన్లు సరికొత్త తీర్మానం చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
తీర్మానంపై కట్టుబడి ఉంటామంటూ..
ఈ మేరకు సారాను ఇకపై స్త్రీల బాత్‌రూమ్‌ల్లోకి అనుమతించకుండా చర్యలు తీసుకునేందుకు రిపబ్లికన్లు నిర్ణయించినట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాపిటల్ భవనంలో మహిళల బాత్‌రూమ్ వినియోగించుకునేందుకు వీల్లేకుండా ఓ తీర్మానం తీసుకొచ్చేందుకు రిపబ్లికన్లు సిద్ధమవగా.. ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ దీనిని సమర్థించడం చర్చనీయాంశమైంది. పురుషులైన ట్రాన్స్ జెండర్లకు ఆడవాళ్ల వాష్ రూముల్లోకి అనుమతిలేదనే తీర్మానంపై కట్టుబడి ఉంటామని జాన్సన్ చెప్పడం విశేషం. ఈ చర్యను మెక్ బ్రైడ్ తీవ్రంగా ఖండించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించడానికే ఇలాంటి వివాదాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: సైకిల్ తోసుకుంటూ వెళ్తున్న ఉస్తాద్ హీరో.. 'RAPO 22' ప్రీ లుక్ వైరల్
ట్రాన్స్‌జెండర్ల బాత్‌రూమ్‌ల విషయంలో అమెరికాలో కొంతకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా పబ్లిక్ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల బాత్‌రూమ్‌లను ట్రాన్స్‌జెండర్ మహిళలు వినియోగించకుండా ఇప్పటికే 11 రాష్ట్రాలు చట్టాలు తీసుకొచ్చాయి.
ఇక సారా మెక్‌బ్రైడ్ డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో అమెరికా కాంగ్రెస్‌లో అడుగుపెట్టబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్ గుర్తింపు పొందనున్నారు. 2025 జనవరిలో ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: AP :ఏపీలో రూ.99కే మద్యం..మందుబాబులకు ఇక పండగే పండగ!
Also Read: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎన్ కౌంటర్.. 20 ఏళ్లకు చిక్కిన విక్రమ్ గౌడ!
ఇది కూడా చదవండి: Kcr: కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు బిగ్ షాక్.. విచారణకు రంగం సిద్ధం!