Fire Accident: హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 44 చేరుకున్న మృతుల సంఖ్య

హాంకాంగ్ లో భవన సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. థాయ్ పొ జిల్లాలోని ఓ పెద్ద భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 44 మంది మృతి చెందగా..మరో 300 మంది కనిపించడం లేదు.

New Update
hongkong

నిన్న మాంకాంగ్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీరని దుఃఖాన్ని కలిగిస్తోంది. నిన్నటికి , ఇవాల్టికి మృతుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇది ఇంకా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. థాయ్ పొ జిల్లాలో ఓ పెద్ద బిల్డింగ్ లో చెలరేగిన మంటలు..పక్కన అపార్ట్ మెంట్లకూ వ్యాపించడంతో ప్రమాదం పెద్దగా అయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 44 మంది మృతి చెందారు. మరో 300 మంది గల్లంతయ్యారు. ఆ నివాస సముదాయంలో మొత్తం 2వేల ఇళ్ళు ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం 7 అపార్ట్‌మెంట్లలో 4,800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్నిప్రమాదంతో 700 మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఈ ఘటనకు కారణమైన ముగ్గురిని హాంకాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

చాలా సేపటి వరకు ఆరని మంటలు..

నిన్న హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.51 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీన్ని నం.5 అలారంగా అక్కడి అధికారులు ప్రకటించారు. ఇది ప్రకటించినప్పుడు అత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు భారీ స్థాయిలో ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. భారా అగ్ని ప్రమాదాలకు మాత్రమే దీన్ని మోగిస్తారు. భవనంలో మంటలు చెలరేగడంతో పాటూ దట్టమైన పొగ అలుముకుంది. భవనాలు అన్నీ దగ్గర దగ్గరగానే ఉండడంతో మిగతా వాటికి వేగంగా మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవిస్తే..రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు చేపట్టగా, 57 అంబులెన్స్‌లు ఘటనాస్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్‌ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు