/rtv/media/media_files/2026/02/13/bangladesh-elections-2026-02-13-06-41-11.jpg)
బంగ్లాదేశ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ (బొగ్రా-6, ఢాకా-17) ఘనవిజయం సాధించారు. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రవాసం తర్వాత దేశంలోకి అడుగుపెట్టిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. తర్వాత సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల సంఘం వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం తారిఖ్ రెహమాన్ తన సొంత జిల్లా అయిన బొగ్రా-6 నియోజకవర్గంలో దాదాపు 2,16,284 ఓట్లతో ప్రత్యర్థులపై విక్టరీ సాధించారు. అలాగే ఢాకా-17లో కూడా ఆయన స్పష్టమైన ఆధిక్యతను కనబరిచి విజేతగా నిలిచారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనపై పెట్టిన కేసులు కొట్టివేసిన తర్వాత, ఈ ఎన్నికల్లో ఆయన రాక పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
BNP has swept the elections in Bangladesh in a landslide victory. Tarique Rahman is now set to become the next Prime Minister.
— Dr Ahmad Rehan Khan (@AhmadRehanKhan) February 13, 2026
The real question now is how this change in Dhaka will reshape Bangladesh’s ties with Pakistan and India. #TariqueRahman#BangladeshElection2026#BNPpic.twitter.com/UkvKWJJ2iG
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గానూ బిఎన్పి ఇప్పటికే 185 స్థానాల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 151 మార్కును ఈజీగా దాటేసింది. మరోవైపు, ప్రధాన పోటీదారుగా భావించిన జమాత్-ఇ-ఇస్లామీ 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2024 ప్రజా తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పతనమవ్వడం, ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీలో లేకపోవడంతో బిఎన్పి ఏకపక్ష విజయం ఖాయమైంది. విజయం ఖాయమవడంతో బిఎన్పి శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇది ప్రజల విజయం. చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడమే మా ప్రథమ ప్రాధాన్యతని తారిఖ్ రెహమాన్ స్పందించారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది, పూర్తి స్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉంది.
🇧🇩 Bangladesh 2026: BNP 209/299, Jamaat 69, Independents 8 ✅
— Mintu Prasad (@mintu_prasad20) February 13, 2026
Referendum YES 77.7%
Tarique Rahman → first male PM in 36 yrs 🏛️
Jamaat/NCP cry rigging; NCP just 4 seats
Army: “Fair election finally.”
Jamaat’s loss = blow to Pak terror groups ⚠️🇵🇰 pic.twitter.com/MzprMwKO7o
Follow Us