Taliban Govt : తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  చెస్ ఆటను బ్యాన్ చేసింది.  చెస్ ఆట జూదానికి మూలంగా పరిగణిస్తున్నామని క్రీడా డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ అన్నారు. దీనికి సంబంధించి మతపరమైన అంశాలను పరిశీలస్తున్నామని తెలిపారు.

New Update
Taliban suspends chess

Taliban suspends chess

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  చెస్ ఆటను బ్యాన్ చేసింది.  చెస్ ఆట జూదానికి మూలంగా పరిగణిస్తున్నామని క్రీడా డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ అన్నారు. దీనికి సంబంధించి మతపరమైన అంశాలను పరిశీలస్తున్నామని తెలిపారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించే వరకు ఈ  నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. మహిళలు ఏ క్రీడల్లో పాల్గొనకుండానే నిషేధించారు తాలిబన్లు.  

ఇటీవలి కాలంలో అనధికారిక చెస్ పోటీలను నిర్వహించిన కాబూల్‌లోని ఒక కేఫ్ యజమాని ఈ నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు.  అయితే అది తన వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు.  ఈ రోజుల్లో యువతకు పెద్దగా కార్యకలాపాలు లేవని..  చాలా మంది ప్రతిరోజూ ఇక్కడికి వస్తున్నారని అజీజుల్లా గుల్జాదా అన్నారు. వాళ్ళు ఒక కప్పు టీ తాగడానికి వచ్చి..వాళ్ళ స్నేహితులను చెస్ ఆటకు అలవాటు చేసేవారని అన్నారు.  అటు ఇప్పటికే  తాలిబన్లు మార్షల్ ఆర్ట్స్ లను కూడా బ్యా్న్ చేశారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు