చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్‌.. తొలిసారిగా ఇంజినీరింగ్ అద్భుతం

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ చేపట్టిన స్టార్‌షిప్‌ ప్రయోగం మొదటిసారిగా విజయవంతమైంది. లాంచ్‌ప్యాడ్‌లో బూస్టర్‌ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ కాగా స్పేస్‌క్రాఫ్ట్‌ కూడా నిర్ధేశించిన ప్రదేశానికి చేరుకుంది.

11
New Update

SpaceX: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు (Elon Musk) చెందిన ‘స్పేస్‌ఎక్స్’ ‘స్టార్‌ఫిష్’ ఐదో ప్రయోగం అరుదైన ఘనత సాధించింది. ఆదివారం ఉదయం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి ఈ రాకెట్‌ను లాంచ్ చేయగా అది నేరుగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ భారీ బూస్టర్ రాకెట్‌లో రెండు దశలుగా ఉంది. అందులో ఒకటి బూస్టర్, రెండవది స్పేస్ క్రాఫ్ట్. ఇందులో బూస్టర్ మొదట విజయవంతంగా భూమికి చేరుకుంది. 

Also Read: మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది: ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్

ఎక్కడ నుంచి ఆకాశంలోకి వెళ్ళిందో తిరిగి అదే ల్యాంచ్ ప్యాడ్‌కు బూస్టర్ చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే సాధారణంగా రాకెట్ ప్రయోగం తర్వాత విడిపోయే బూస్టర్లను సముద్రంలో రికవర్ చేస్తారు. కానీ ఈ సారి మాత్రం బూస్టర్ ఎక్కడ నుంచి నింగికెగసిందో.. మళ్లీ అదే స్థానానికి చేరుకుంది. 

తొలిసారిగా ఇంజినీరింగ్ అద్భుతం

దీంతో ఇది తొలిసారిగా ఒక ఇంజినీరింగ్ అద్భుతం అని ప్రముఖులు ప్రశంససిస్తున్నారు. దీని కారణంగా రాకెట్ ప్రయోగాల్లో ఖర్చు తగ్గించుకోవడం, సమయాన్ని ఆదా చేయడం వంటి ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రాకెట్ సక్సెస్‌తో స్పేస్‌ఎక్స్ సంస్థ ఓనర్ ఎలాన్ మస్క్‌ని ప్రపంచ ప్రముఖులు కొనియాడుతున్నారు.

Also Read: Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే?

మరో వైపు స్పేస్ క్రాఫ్ట్ తన ప్రయాణాన్ని కొనసాగించిన అనంతరం హిందూ మహాసముద్రంలో నిర్దేశించిన ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంతో స్పేస్‌ఎక్స్ కంట్రోల్ రూంలో సందడి వాతావరణం నెలకొంది.

ఎందుకు రూపొందించారు

కాగా ఈ స్టార్‌షిప్ రాకెట్ దాదాపు 121 మీటర్లు పొడవు (400 అడుగులు) ఉంటుంది. ఇది బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్‌ అనే రెండు దశలుగా ఉంటుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాకెట్‌గా పేరుగాంచింది. కాగా దీన్ని చందమామ, అంగాకుడిపై యాత్రలకు వీలుగా ‘స్పేస్‌ఎక్స్’ రూపొందించింది. 

#elon-musk #tech-news-telugu #spacex
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe