/rtv/media/media_files/2025/07/15/bubblegum-2025-07-15-16-20-09.jpg)
Bubblegum
కొన్ని దేశాల్లో వింత చట్టాలు ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు క్రమశిక్షణ కోసం కొన్ని చట్టాలను తీసుకొస్తాయి. అయితే అక్కడ చట్టాలు వింటే మనకి వింతగా అనిపించవచ్చు. కానీ ప్రజల సంరక్షణ కోసం వీటిని తీసుకొస్తారు. అయితే ఏయే దేశాల్లో వింత చట్టాలు ఉన్నాయో మీకు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!
2. Es ilegal mascar chicle en Singapur
— Tushar (@tusmedios) February 27, 2024
Singapur prohibió el chicle en 1992 tras gastar $150,000 anuales en limpiar daños causados por vándalos. La importación, venta o fabricación de chicle puede llevar a multas o cárcel, excepto chicles de nicotina o terapéuticos. pic.twitter.com/PtB7LejIb3
ఇది కూడా చూడండి: Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
చేపలకు చోటు లేదు
కొందరు చేపలను బౌల్‌లో పెంచుకుంటారు. వీటిని పెంచుకోవడం వల్ మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, అందమైన చేపలను పెంచుతారు. అయితే ఇటలీలో గుండ్రని జాడీలో చేపలను పెంచడం నిషేధం. జాడీలో తగినంత స్థలం ఉండదు. దీనివల్ల ఆ చేపలకు సరిపడా ఆక్సిజన్ అందదు. ఇది చేపల ఆరోగ్యానికి మంచిది కాదని ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. చేపలకు స్వేచ్ఛగా ఈదడానికి, సరిపడా ఆక్సిజన్ అందుకోవడానికి వీలుగా చతురస్రాకార లేదా దీర్ఘచతురస్రాకార అక్వేరియంలను ఉపయోగించాలని తెలిపింది.
ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా
బబుల్ గమ్ నమలడం నేరం
ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన దేశం సింగపూర్. ఇక్కడ అంతా పరిశుభ్రంగా ఉండాలని ఎన్నో కఠినమైన చట్టాలను తీసుకొస్తారు. అయితే ఇక్కడ బబుల్ గమ్ నమలడం నేరం. ఈ దేశంలో అసలు బబుల్‌గమ్‌ను తయారు చేయరు.. విక్రయించరు. బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో 1992లో ఓ చట్టం తీసుకొచ్చి బబుల్‌గమ్‌ను నిషేధించారు. ప్రజలు బబుల్ గమ్‌ను నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం, మెట్రో రైళ్లలో సీట్లకు లేదా తలుపులకు అంటించడం వంటివి చేసేవారు. దీనివల్ల నగర పరిశుభ్రత దెబ్బతినడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థకు కూడా నష్టం వాటిల్లుతుంది. అందుకే సింగపూర్ ప్రభుత్వం ఈ కఠినమైన చర్య తీసుకుంది. అంటే ఆరోగ్య ప్రయోజనాల కోసం వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌తో కూడిన బబుల్ గమ్‌ను మాత్రమే సింగపూర్‌లో అనుమతిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో దీన్ని నమలడం, అంటించడం వంటివి చేస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా ఉంటుంది.
ఇది కూడా చూడండి:Vivo X Fold 5 Price India: అమేజింగ్.. 16GB ర్యామ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వివో కొత్త ఫోన్ అదిరింది మచ్చా!
Strange Laws