/rtv/media/media_files/2026/01/03/fotojet-65-2026-01-03-11-42-56.jpg)
Sex before marriage..now you will go to jail
Indonesia Pre Marital Sex Ban : ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఇండోనేషియా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ వివాదస్పద చట్టాన్ని అమల్లోకి తెస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఈ చట్టం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపేలా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఆ 'కొత్త శిక్షాస్మృతి'ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. వివాహం చేసుకోకుండా జంటలు సహజీవనం చేయడం లేదా పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని వెల్లడించింది. దీన్ని ఉల్లంఘిస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ చట్టం కేవలం స్థానికులకే కాకుండా అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తుందని, వారు కూడా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.
కాగా పర్యాటక స్వర్గధామంగా పేరొందిన ఇండోనేషియాలో పర్యాటక రంగానికి మంచి గుర్తింపు ఉంది. ప్రపంచ పర్యాటలకు ఎక్కువగా ఇక్కడి ప్రాంతాల్లో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతారు. అయితే ఇకపై ఆ స్వేచ్ఛకు సంకెళ్లు పడనున్నాయి. దశాబ్దాల కాలం నాటి డచ్ వలసవాద చట్టాలను ఇండోనేషియా పక్కనపెట్టింది. ప్రస్తుతం సొంతంగా రూపొందించుకున్న నూతన శిక్షాస్మృతిని శుక్రవారం నుంచి ఆ దేశం అధికారికంగా అమలు చేస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం.. వివాహానికి ముందు శృంగారంలో పాల్గొనడం, పెళ్లి కాకుండా సహజీవనం చేయడం ఇప్పుడు తీవ్రమైన నేరంగా పరిగణించబడటం గమనార్హం.
ప్రస్తుతం నూతన శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 411 ప్రకారం.. వివాహం కాకుండా శృంగారంలో పాల్గొంటే గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక కీలక నిబంధన ఉండటం గమనార్హం. కేవలం బాధితుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మూడవ వ్యక్తులు లేదా అపరిచితులు చేసే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోరు. అదేవిధంగా వివాహం చేసుకోకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉంటే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని కొంత చట్టం చెబుతోంది.
Follow Us