ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో సంచలనం.. బ్రిటన్ యువరాజు ముందు బాలికకు ఎలక్ట్రిక్ షాక్

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారంలో మరో విషయం బయటపడింది. 6 నుంచి 8 ఏళ్ల వయసున్న బాలికకు లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడని.. ఆ సమయంలో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నాయి.

New Update
Ex prince Andrew

Ex prince Andrew

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారంలో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కేసులో బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన మాజీ ప్రిన్స్‌ ఆండ్రూ మౌంట్ బాటెన్ విండ్సర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆయనకు సంబంధించి కీలక విషయాలు బయటపడ్డాయి. బ్రిటన్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 6 నుంచి 8 ఏళ్ల వయసున్న బాలికకు లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడని.. ఆ సమయంలో ఆండ్రూ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నాయి. 

Also Read: ఇరాన్‌ ఆధినంలోకి హార్ముజ్ జలసంధి.. అమెరికాకు డెత్‌ వారెంట్‌

ఆ బాలికను టేబుల్‌పై బంధించి ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పినట్లు వెల్లడించాయి. ఈ ఆరోపణలు FBI పత్రాల్లో ఉన్నాయని.. బ్రిటన్‌లోని ఫ్రాగ్మోర్ కాటేజ్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు పేర్కొన్నాయి. కానీ ఆండ్రూ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. అయితే 1994 నుంచి 1996 మధ్య హ్యుమన్ ట్రాఫికింగ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపు లాంటి ఆరోపణలపై తమకు అవగాహన లేదని సర్రే పోలీసులు తెలిపారు. 

Also Read: ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్లాన్‌.. పర్మిషన్ ఇవ్వని యూకే

ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ రెండు ఘటనలకు సంబంధం లేదని చెప్పారు. దీనికి సంబంధించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమకు అందించాలన్నారు. ఇదిలాఉండగా ఆండ్రూ.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు పెట్టుకోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసందే. కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత ఆయన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు.