హైకోర్టును కూడా కూలుస్తావా రంగనాథ్.. కోర్టు విచారణ వీడియో వైరల్! హైడ్రాకు నిన్న హైకోర్టు చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు, చార్మినార్ ను కూడా కూలుస్తారా? అంటూ న్యాయమూర్తి హైడ్రా చీఫ్ రంగనాథ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి. By Bhavana 01 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణలో మొదటి నుంచి కూడా హైడ్రా కూల్చివేతల గురించి వ్యతిరేకత ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అమీన్ పూర్ లో.. ఇటీవల హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న కూడా కూల్చివేశారంటూ ఇంటి యజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ మేరకు తమ ముందు నేరుగా లేదా వర్చువల్ గా కానీ హజరు కావాలని కూడా సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో.. తెలంగాణలో నిన్న హైడ్రా కూల్చివేతల గురించి వాడీ వేడీగా వాదనలు నడిచాయి. HYDRA - Ranganath హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ గా స్పందించింది.ముఖ్యంగా శని, ఆదివారాలలో కూల్చివేతలేంటనీ హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. అంతే కాకుండా..హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు కురిపించింది. ఓవర్ నైట్ లో హైదరాబాద్ ని మార్చాలని అనుకుంటున్నారా.. అని సీరియస్ అయ్యింది. అంతే కాకుండా.. అసలు ఎఫ్టీఎల్ పరిధి ఏంటో తెల్చకుండా కూల్చివేతలేంటని జడ్జి సీరియస్ అయ్యారు. రాజకీయ నాయకుల్ని సాటిస్ఫై చేసేందుకు.. మీరు చర్యలు చేయోద్దని వార్నింగ్ ఇచ్చింది. అసలు నల్లకుంట, బతుకమ్మ కుంటల పరిస్థితి ఏంటని రంగనాథ్ ని జడ్జి ప్రశ్నించారు. అంతే కాకుండా.. దీనిపై హైకోర్ట్ జడ్జీ మాట్లాడుతూ... తాను 1983 లో హైదరబాద్ కు వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇబ్రహీంపట్నం వెళ్తున్నాన్నారు. ఒక్కసారిగా కూడా అక్కడ నీళ్లు వరదలు చూడలేదన్నారు. హైడ్రా టార్గెట్ కేవలం.. కూల్చివేతల మీదనే ఉందని జడ్జీ అన్నారు. ఎమ్మార్వో అడిగితే.. మేసిన్, మనుషుల్ని ఇచ్చామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైకోర్టును, చార్మినార్ ను కూల్చేయమంటే అవి కూడా కూల్చేస్తారా అంటూ జడ్జి రంగనాథ్ ను ప్రశ్నించారు. అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ కూడా హైడ్రా రంగనాథ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా మొత్తంగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలను ఉన్నాయని గుర్తించారని అడిగారు. ఎన్నింటికి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించారు. చాలా మంది కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, బ్యాంక్ లోన్ లు తీసుకుని మరీ ఇళ్లను కొనుగోలుచేశారని వ్యాఖ్యలు చేసింది. మీరు చెప్తున్న సమాధానాలకు.. గ్రౌండ్ లేవల్ జరుగుతున్న వాటికి పొంతనలేదని హైడ్రా కమిషనర్ మీద జడ్జి సీరియస్ అయ్యారు. ఇలానే కూల్చివేతలు చేస్తే కనుక.. హైడ్రాపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం సీరియస్ అయ్యింది. ఇదిలా ఉండగా.. కోర్టులో హైడ్రా రంగనాథ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఒక నిజాయితీ గల అధికారి రేవంత్ రాజకీయాలకు బలౌతున్నాడని అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా..ఇప్పటి రాజకీయా నాయకుల ఒత్తిడిలకులోనై పనులు చేస్తే.. ఆ తర్వాత అధికారులు ఇబ్బంది పడాల్సి ఉంటుందని కూడా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. Also Read: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత! #telangana-high-court #hydra #ranganath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి