Canada: కొంతమందిపై నిఘా ఉంచాం..మళ్ళీ మొదలెట్టిన కెనడా

కెనడా ప్రభుత్వం భారత్‌ను ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. మొన్న భారత దౌత్య వేత్తలను వెళ్ళిపోవాలని చెప్పిన ఆ దేశం ఇప్పుడు తాజాగా మిగతా వారిపై నిఘా పెట్టామని చెబుతోంది. అంతే కాకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ  అక్కసు వెళ్ళగక్కారు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ.

New Update
canada

Canada Foreign Minister Melanie Joly

నిజ్జర్ హత్య కేసులో ఆధారాలు చూపించకుండా అభాండాలు వేస్తూనే ఉంది కనెడా ప్రభుత్వం. తమ దగ్గర ఉన్నాయంటారు కానీ ఏమీ చూపించరు. కానీ ఎప్పుడూ మాటలను మీరుతూనే ఉంటుంది..మన దౌత్యవేత్తలపై పెత్తనం చెలాయిస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా నిజ్యతర్ హత్య కేసుల అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మను చేర్చింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది. దాంతో అక్కడి నుంచి మన అధికారులను వెనక్కు తెచ్చేయాలని భారత ప్రభుత్వం అనుకుంది. కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. ప్రతిగా కెనడా కూడా అదే పని చేసింది. 

Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..  

రష్యాతో పోలిక..

ఇలా రెండు దేశాల మధ్య పరిస్థితులు ఇంత ఉద్రిక్తంగా ఉండగా...ఇప్పుడు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోనీ భారత్ మీద అవాకులు చవాకులు పేలారు. రష్యా, భారత్‌లను పోలుతూ మాట్లాడారు. మా దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. అంతర్జాతీయ శక్తులు కెనడా గడ్డపై ఇలాంటి అణచివేతకు పాల్పడటాన్ని మేం జరగనివ్వము. ఐరోపాలో ఇలాంటివి మేం చూశాం. జర్మనీ, యూకేలో రష్యా ఆ పనిచేసింది. ఇలాంటివాటికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడాల్సి ఉంది అంటూ మెలానీ అనడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. 

Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..  

ఆధారాలు లేవు కానీ..

మరోవైపు కెనడాలో కొంత మంది దౌత్యవేత్తను బహిష్కరించాం...మరికొంత మంది మీద నిఘా పెట్టాం అని చెప్పుకొచ్చారు మెలానీ. వియన్నా కన్వెన్షన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని సహించం అంటూ వ్యాఖ్యలు చేశారు.  గతేడాది మొదలైన కెనడా దుందుడుకు వ్యవహారం ఇప్పటికీ ఆగడం లేదు. కేవలం నిఘా సమాచారం ఆధారంగా భారత్‌ పై ఆరోపణలు చేశామని కెనడా ప్రధాని ట్రుడోనే స్వయంగా ఒప్పుకున్నారు. అయినా కూడా  ఇంకా అనవసరమైన మాటలు ఆరోపణలు మాత్రం ఆపడం లేదు. 

Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Also Read: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

Advertisment
తాజా కథనాలు