BIG BREAKING: నేపాల్ ప్రధాని ఇల్లు ముట్టడి.. హోంమంత్రి రాజీనామా

సోషల్ మీడియా నిషేధంపై వ్యతిరేకంగా చేపడుతున్న ఆంధోళనలో యువత వెనక్కి తగ్గడం లేదు. రాజధాని కాట్మాండూలో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దేశంలో నిరసనకారులు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

New Update
Nepal Home Minister resigns

సోషల్ మీడియా నిషేధంపై వ్యతిరేకంగా చేపడుతున్న ఆంధోళనలో యువత వెనక్కి తగ్గడం లేదు. రాజధాని కాట్మాండూలో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దేశంలో నిరసనకారులు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనల నేపథ్యంలో, హోం మంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి నివాసమైన బలువతార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భద్రతా బలగాలు వారిని అడ్డుకోవడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ హింసాత్మక ఆందోళనల్లో ఇప్పటివరకు 19 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. శాంతిభద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాను ప్రధానమంత్రికి సమర్పించారు. హోం మంత్రి రాజీనామా అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. ప్రధాని ఓలి కూడా తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజల ఆందోళనలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ ఘటనలతో నేపాల్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఖాట్మండుతో సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు