Louvre museum Robbery: ధూమ్ సినిమా స్టైల్‌లో చోరీ.. పింక్‌ పాంథర్స్‌ గ్యాంగ్‌ పనేనా?

ప్యారిస్‌ లూవ్రే మ్యూజియంలో చోరీ సంచలనంగా మారింది. రోజులు గడుస్తున్న దొంగల జాడ మాత్రం తెలియలేదు. మెరుపు వేగంతో కేవలం 7 నిమిషాల్లోనే చారిత్రాత్మక, విలువైన నెపోలియన్ ఆభరణాలు కొట్టేశారు. ఈ చోరీ వెనుక పింక్ పాంథర్ గ్యాంగ్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

New Update
Paris museum

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్యారిస్‌లోని లూవ్రే మ్యూజియంలో చోరీ సంచలనంగా మారింది. రోజులు గడుస్తున్న దొంగల జాడ మాత్రం తెలియలేదు. మెరుపు వేగంతో కేవలం 7 నిమిషాల్లోనే చారిత్రాత్మక, విలువైన నెపోలియన్ ఆభరణాలు కొట్టేశారు. ఈ చోరీ వెనుక పింక్ పాంథర్ గ్యాంగ్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన అంతర్జాతీయ దొంగల ముఠాను మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. నెపోలియన్ కాలం నాటి అత్యంత విలువైన ఆభరణాలను దొంగలు కేవలం ఏడు నిమిషాల్లోనే ఎత్తుకెళ్లిన తీరు.. ఈ దొంగల ముఠా పద్ధతిని పోలి ఉండడం విశేషం. మ్యూజియంలోకి చొరబడి నెపోలియన్ కాలానికి చెందిన తొమ్మిది అత్యంత విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగిలించిన వస్తువుల విలువ సుమారు 500 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.4,150 కోట్లు) ఉంటుందని అంచనా.

ఈ దోపిడీ జరిగిన తీరు చూస్తే హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించింది. బాలీవుడ్ రుతిక్ రోషిన్ దూమ్ సినిమా స్టైల్‌లో చాకచక్యంగా, పక్కా ప్లానింగ్‌తో చోరీ చేశారు. ఈ దోపిడి ఎలా జరిగిందో వివరిస్తూ సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు కూడా చక్కర్లు కొడుకున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాంతం నుంచి ముసుగు దొంగలు మ్యూజియం లోపలికి ప్రవేశించారు. డిస్క్ కట్టర్లతో అపోలో గ్యాలరీలోని పటిష్టమైన గాజు పెట్టెలను పగలగొట్టి, మెరుపు వేగంతో ఆభరణాలను దొంగిలించి స్కూటర్లపై పారిపోయారు. అంతటి హై సెక్యూరిటీ మధ్య నిమిషాల వ్యవధిలో ఈ చోరీ జరగడం అధికారులు షాక్‌లో ఉండిపోయారు.  

పింక్ పాంథర్ గ్యాంగ్ అంటే ఎవరు?
'పింక్ పాంథర్' అనేది సెర్బియా, మోంటెనెగ్రో ప్రాంతాల్లో పుట్టిన ఓ అంతర్జాతీయ నేర ముఠా. 1990ల ప్రారంభం నుంచి 2010ల మధ్య కాలంలో వీరు యూరప్, ఆసియాలోని ఖరీదైన ఆభరణాల దుకాణాలు, మ్యూజియాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేశారు. ఇంటర్‌పోల్ అంచనా ప్రకారం, వీరు సుమారు $500 మిలియన్ డాలర్ల (దాదాపు ₹4,150 కోట్లు) విలువైన ఆభరణాలు, కళాఖండాలను దోచుకున్నారు. వీరు అత్యంత వేగంగా, సాహసోపేతంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీలు చేయడంలో ప్రసిద్ధి చెందారు. లూవ్రే చోరీలో పింక్ పాంథర్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయినా, ఈ సినీ ఫక్కీ చోరీ, ప్రపంచంలోని అత్యంత పటిష్టమైన భద్రత ఉండే మ్యూజియంలలో ఒకదానిని లక్ష్యంగా చేసుకోవడం, అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫ్రెంచ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisment
తాజా కథనాలు