/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రైల్వే ట్రాక్‌పై జరిగిన భారీ పేలుడు కారణంగా క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ట్రైన్ పట్టాలు తప్పింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. మంగళవారం సాయంత్రం IED పదార్థాలతో బ్లాస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లాస్ట్ ఎవరు చేశారనేది ఇంకా తెలియదు. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం. డజర్ల కొద్దీ ప్రయాణీకులు గాయాలయ్యాయి.
BREAKING: Baloch fighters attacked Jaffar Express in Mastung, targeting Punjabi soldiers. At least 21 killed, many injured. Fighters call it revenge for the abduction, rape & killing of 3 Baloch girls on Sept 14 by Pakistani Punjabi troops. pic.twitter.com/OwLsPg6hKb
— Baba Banaras™ (@RealBababanaras) September 23, 2025
మస్తుంగ్ జిల్లాలోని స్పెజాంద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది, దీంతో రైలు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని రక్షించి, చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ సంఘటనపై పాకిస్తాన్ రైల్వేస్ మంత్రి హనీఫ్ అబ్బాసీ విచారణకు ఆదేశించారు.
BREAKING: Baloch fighters attacked Jaffar Express in Mastung, targeting Punjabi soldiers. At least 21 killed, many injured. Fighters call it revenge for the abduction, rape & killing of 3 Baloch girls on Sept 14 by Pakistani Punjabi troops. pic.twitter.com/0OVL9KWJi9
— IndiaWarZone (@IndiaWarZone) September 23, 2025