/rtv/media/media_files/2025/05/10/5yWOFEJCulpclAmdMglI.jpg)
un india pak
గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఎట్టకేలకు ముగిశాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించడంతో ప్రతీకార చర్య కచ్చితంగా ఉండాల్సిందేనంటూ దేశంలోని ప్రతి ఒక్కరినుంచి డిమాండ్లు లేవనెత్తాయి. అటువంటి పరిస్థితిలో భారత ప్రభుత్వం బలమైన సైనిక వ్యూహంతో 'ఆపరేషన్ సింధూర్'ను నిర్వహించింది.
ఈ ఆపరేషన్‌లో భారత దళాలు పాకిస్తాన్, పీఓకెలోకి ప్రధాన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. అనంతరం పాక్ కూడా అటాక్ చేసినప్పటికీ భారత్ సైన్యం ముందు నిలబడలేకపోయింది. దీంతో ఆమెరికా జోక్యం చేసుకోవడంతో ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ముందుకు రావడాన్ని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు.
UN chief Antonio Guterres welcomes 'all efforts to de-escalate the conflict', as India and Pakistan agree to immediate ceasefire. #ceasefire
— Abhijit Pathak (@aajtakabhijit) May 10, 2025
ముందునుంచి శాంతి
ఇరు దేశాల ఉద్రిక్తతల నడుమ ముందు నుంచి శాంతినే కోరుకుంటున్న ఆంటోనియో గుటెరస్ .. రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. పహల్గామ్ దాడి తర్వాత భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని, పొరపాట్లు చేయొద్దని..దీనికి సైనిక చర్య పరిష్కారం కాదని తెలిపారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా తాము సహకరిస్తామని చెప్పుకొచ్చారు. పహల్గామ్ దాడిని తాను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. ఇప్పుడు కాల్పుల విరమణకు ఆంగీకరించడం ఆయన స్వాగతించారు.