Norway: అమెరికాకు నార్వే బిగ్ షాక్.. ఆ సేవలు నిలిపివేత

అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు కూడా చమురు ఇవ్వమని నార్వే ప్రకటించింది. అమెరికాకు చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తున్న హాల్ట్ బ్యాక్ అనే నార్వేకు చెందిన సంస్థ ప్రకటించింది.

New Update
Donald Trump

Donald Trump

అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు ఒక్క లీటరు కూడా చమురు ఇవ్వమని నార్వే ప్రకటించింది. అమెరికాకు చమురు నిల్వల్ని, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తున్న హాల్ట్ బ్యాక్ అనే నార్వేకు చెందిన సంస్థ ఈ సంచలన ప్రకటన చేసింది. ఇతర యూరప్‌ సంస్థలకు కూాడా ఇదే విధానాన్ని పాటించాలని కోరింది. అయితే వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీ, ట్రంప్‌ మధ్య గొడవ జరగడం వల్లే ఆ నార్వే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జెలెన్‌స్కీకి మద్దతుగా యూరోపిన్ దేశాలు నిలుస్తున్నాయి.

Also Read: 4వేల ఎకరాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - 80కి పైగా భవనాలు దగ్ధం..!

 అయితే ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య శనివారం బహిరంగ చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ ఖనిజాలను తమకు అప్పగించాలని.. ట్రంప్‌ పట్టుబడ్డారు. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయాలని కోరారు. కానీ రష్యా మళ్లీ దురాక్రమణకు పాల్పడితే తమకు రక్షణ కల్పిస్తారా ? అని జెలెన్‌స్కీ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ఇరుదేశాల అధినేతల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. చివరికి జెలెన్‌స్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే వెళ్లారు. 

Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

కానీ ఆ తర్వాత మళ్లీ తాము మినరల్స్‌ డీల్స్‌పై సంతకం చేసేందుకు సిద్ధమేనని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.'' ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు మేము సిద్ధమే. భద్రకు గ్యారంటీ ఇచ్చేందుకు ఇది తొలి అడుగు అవుతుంది. కానీ ఇది సరిపోదు. మాకు అంతకన్నా ఎక్కువ కావాలి. సెక్యూరిటీ గ్యారెంటీలు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందం ఉక్రెయిన్‌కు చాలా ప్రమాదకరం. గత మూడేళ్లుగా మేము పోరాడుతున్నాం. అమెరికా తమ వైపే ఉందని ఉక్రెయిన్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని'' ఎక్స్‌లో తెలిపారు. అంతేకాదు అమెరికాకు తాము రుణపడి ఉంటామని కూడా మరో ట్వీట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు