No shave November: ప్రతి ఏడాది నవంబర్ నెలలో నో షేవ్ నవంబర్‌ను జరుపుకుంటారు. మనలో చాలామందికి ఈ నో షేవ్ నవంబర్ గురించి పెద్దగా తెలియదు. అసలు ఈ నో షేవ్ నవంబర్ ఏంటని మీరు కూడా ఆలోచిస్తున్నారా.. అయితే ఆలస్యం చేయకుండా ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్
ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహన..
నో షేవ్ నవంబర్ అంటే.. ఈ నెలలో గడ్డం, జుట్టు, మీసాలు కత్తిరించుకోకుండా ఉండాలి. గత కొన్నేళ్ల నుంచి ఈ నో షేవ్ నవంబర్‌ను ప్రతీ నెల పదకొండవ నెలలో జరుపుకుంటున్నారు. అయితే దీన్ని స్టైల్ కోసం కాకుండా ప్రొస్టేట్ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నో షేవ్ నవంబర్ అనేది ఒక సందేశంలాంటిది.
ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..
చికాగోలోని రెబెక్కా హిల్ తండ్రి, మాథ్యూ 1996 నుంచి పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడ్డారు. చికిత్స తీసుకుంటూనే 2007లో మరణించారు. దీంతో అతని కుమారులు, కుమార్తెలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పురుషులు ఎక్కువగా ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతుంటారు. దీనికి చికిత్స తీసుకునే క్రమంలో జుట్టును ఎక్కువగా కోల్పోతారు.
ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..!
ఇలాంటి వారికి జుట్టు డొనేట్ చేయడం కోసం నవంబర్ నెల మొత్తం షేవ్ చేసుకోకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ రోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తారు. మొదట్లో పురుషులు మాత్రమే నో షేవ్ నవంబర్ పాటించేవారు. ఇప్పుడు కొందరు అమ్మాయిుల కూడా దీన్ని పాటిస్తున్నారు. జుట్టు, హైబ్రోస్ కట్ చేసుకోకుండా నెల మొత్తం ఉంటున్నారు.
ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య