New Zealand: న్యూజిలాండ్ అంటే ఓ అందమైన, అభివృద్ధి చెందిన దేశం. కివీస్‌కి వెళ్లి ఏదైనా ఉద్యోగం, వ్యాపారం చేసుకోని అక్కడే సెటిల్ అవ్వాలని చాలామంది అనుకుంటుంటారు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. దీని ప్రభావంతో అక్కడ నివసిస్తున్న వలసవాదులు ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబయి లాంటి నగరాలకు కూడా వెళ్లిపోతున్నారు. న్యూజిలాండ్ అధికారిక గణంకాల ప్రకారం.. ఆర్థికమాంధ్యం ప్రభావంతో ఇటీవల కార్పొరేట్ కంపెనీల్లో లేఆఫ్‌లు జరిగాయి, వ్యాపారాలు కూడా మూతపడ్డాయి. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఆ దేశ జనాభాలో 1.5 శాతం మంది వేరే దేశాలకు వెళ్లిపోయారు. అందులో 0.6 శాతం మంది మన భారతీయులో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: తిరుపతి లడ్డూతో రాజకీయాలు వద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఉద్యోగులకు ఎదురుదెబ్బ
గత ఏడాది న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. చివరికి వినియోగాదారులు ఖర్చు చేయడం చాలావరకు తగ్గిపోయింది. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ పతనానికి ఇదే ప్రధానాంశంగా భావిస్తున్నారు.ఇదిలాఉండగా.. రెండు వారాల క్రితం హైదరాబాద్‌కు రాకముందు న్యూజిలాండ్‌లో ఉంటున్న జైన్ పూనావాల తన పరిస్థితిని వివరించాడు. ఒక్క ఏడాదిలోనే తాను నడిపిస్తున్న చేపల వ్యాపారంలో 60 శాతం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. స్థిరమైన జీవితం కోసం 2006లో న్యూజిలాండ్‌కు వెళ్లామని.. ఆర్థిక మందగమనం వల్ల ఒక్క ఏడాదిలోనే మా వ్యాపారంలో మూడు స్టోర్లను బలవంతగా మూసివేయాల్సి వచ్చిందని వాపోయాడు. హైదరాబాద్‌కు తిరిగిరావడం తప్పా మరో మార్గం లేదన్నాడు. ప్రస్తుతం తన కుటుంబం ఇక్కడ ఫుట్‌వేర్ తయారీ వ్యాపారాన్ని నడిపిస్తోందని.. ఇక ఇందులోనే తాను కూడా చేరుతానని చెప్పారు. మరోవైపు గత ఆరునెలల్లో భారీగా లేఆఫ్‌లు జరగడంతో అక్రిడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా మీద వచ్చినవాళ్లకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Also Read: బీర్ కోసం కన్న బిడ్డను.. ఏం చేశారో తెలిస్తే షాక్ కావాల్సిందే!
న్యూజిలాండ్‌లో ఎవరికైనా ఉద్యోగ అవకాశం వస్తే.. అక్రిడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసాపై వచ్చి ఆ దేశంలోనే ఉండి పనిచేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉద్యోగుల పరిస్థితి బాలేదని ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన ఇందూపూలే అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన బాధను వెల్లడించింది. కంపెనీలు తరచుగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. న్యూజిలాండ్‌కు వర్క్ వీసాపై వచ్చానని జాబ్ పోవడంతో ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. ఇప్పుడు తన సొంత స్థలమైన ముంబాయికి వచ్చే పరిస్థితి ఉందని పేర్కొంది. ఇండియాలో కూడా తనకు సంబంధించిన రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. కేవలం విదేశాల వలసవాదులు మాత్రమే కాదు ఆఖరికి న్యూజిలాండ్ వాసులు కూడా వేరే దేశాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఈ ఆర్థిక సంక్షోభం ఇంకా ఎలాంటి ప్రభావాలకు దారితీస్తుందనే దానిపై అక్కడి వాసులు ఆందోళన చెందుతున్నారు.