/rtv/media/media_files/2025/12/27/fotojet-22-2025-12-27-20-56-59.jpg)
California Hurricane
California: జనమంతా క్రిస్మస్ సంబురాల్లో తేలియాడుతుండగా అమెరికాలో ఒక్కసారిగా తుఫాన్ తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. పండుగ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలనుకున్నా అమెరికా వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. అమెరికాలో విపరీతంగా కురుస్తున్న మంచు, వాతావరణం అస్సలు బాలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ సమయంలో ఈ తుఫాను రావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం నాటికి దాదాపు 1,800 విమానాలు రద్దు అయ్యాయి. 22 వేల కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ (JFK, లాగ్వార్డియా, న్యూవార్క్), డెట్రాయిట్, బోస్టన్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తుఫాన్ ముంచెత్తింది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో బలమైన ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలతో దక్షిణాది రాష్ట్రాలు నీట మునిగాయి. . క్రిస్మస్ పండుగ వేళ కాలిఫోర్నియాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. శీతాకాలపు తుఫాను కారణంగా దక్షిణ కాలిఫోర్నియా అస్తవ్యస్తమైంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటివరకు కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీన్ని శాస్త్రవేత్తలు 'అట్మాస్ఫియరిక్ రివర్స్' అని పిలుస్తున్నారు. వరద ముప్పు ఎక్కువగా ఉన్న లాస్ ఏంజిల్స్, శాన్ బెర్నార్డినో వంటి ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు
పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు మెరుపు వేగంలో నగరాల్లోకి దూసుకొచ్చాయి. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో నివాసాలు ధ్వంసం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం నీట మునిగాయి. భారీ వరదల కారణంగా హిల్ రిసార్ట్ కట్టడాలు నీటిలో కొట్టుకుపోయాయి.
ఇక లాస్ ఏంజెలెస్‌కు ఈశాన్యంగా 80 మైళ్ల దూరంలో ఉన్న శాన్ గాబ్రియేల్ పర్వత ప్రాంతంలోని రోడ్లు మొత్తం బురదగా మారడంలో పలు వాహనాలు చిక్కుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా శాన్‌డియాగోలో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందగా, శాక్రమెంటోలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాలిఫోర్నియాలో గవర్నర్ గెవిన్ న్యూసమ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
స్థానికంగా ఉన్న ప్రజలు వెంటనే తమ నివాసాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులకు అదేశాలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రత తగ్గేవరకు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రకృతి వైపరిత్యం కారణంగా భారీ ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు పేర్కొన్నారు.
Follow Us