Ring Of Fire: అక్టోబర్ 2న 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం!

అక్టోబర్‌ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి గ్రహణం సమయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి రింగ్‌ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు.

New Update
sun

Ring Of Fire: వినీలాకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటు చేసుకోనుంది. అక్టోబర్‌ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి గ్రహణం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఖగోళ దృగ్విషయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని, చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి ప్రకాశవంతమైన రింగ్‌ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు.

దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఈ ఖగోళ దృశ్యం 6 గంటలకు పైగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

భారత్‌లో కనిపించనుందా..? 

భారత లో టైమింగ్‌ ప్రకారం.. రాత్రి 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించే వీలు లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని వెల్లడించారు. 

'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం అంటే....

భూమి, సూర్యుడి కక్ష్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణంలో సూర్యుడికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు. కానీ చంద్రుడి పరిమాణం చిన్నది కావడంతో సూర్యుడి ఉపరితలం ప్రకాశవంతమైన అగ్ని వలయం లాగా కనిపిస్తుంది. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు.

Also Read: హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ లో 2.5 కోట్ల బంగారం చోరీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు