Louvre Museum Robbery: పారిస్ మ్యూజియంలో భారీ చోరీ.. నెపోలియన్ ఆభరణాలు మాయం

పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లౌవ్రే మ్యూజియంలో ఆదివారం చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియం నుంచి నెపోలియన్ సామ్రాజ్యానికి చెందిన అపురూప ఆభరణాలను దొంగలు అపహరించారు. వెంటనే మ్యూజియంను మూసివేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

New Update
Louvre Heist

Louvre Museum Robbery: పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లౌవ్రే మ్యూజియంలో ఆదివారం చోరీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియం నుంచి నెపోలియన్ సామ్రాజ్యానికి చెందిన అపురూప ఆభరణాలను దొంగలు అపహరించారు. నిర్మాణంలో ఉన్న ప్రాంతం నుంచి బాస్కెట్ లిఫ్ట్ సాయంతో మ్యూజియం లోపలికి ప్రవేశించిన దొంగలు, కేవలం ఏడు నిమిషాల వ్యవధిలో ఈ దోపిడీని పూర్తి చేశారు. వారు డిస్క్ కట్టర్ వంటి పరికరాలతో గ్యాలరీ పగులగొట్టి, నెపోలియన్, ఎంప్రెస్ యూజీనీకి చెందిన తొమ్మిది విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఫ్రెంచ్ మీడియా తెలిపింది. దొంగల బృందం మోటార్‌సైకిళ్లపై పారిపోయినట్లు సమాచారం.

ఈ చోరీ జరిగిన సమయంలో మ్యూజియం తెరిచి ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదని ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ మంత్రి రాషిడా దతి ధృవీకరించారు. చోరీకి గురైన ఆభరణాల చారిత్రక, వారసత్వ విలువ అపారమైనది అని అధికారులు పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే మ్యూజియంను మూసివేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, దొంగిలించబడిన ఆభరణాల్లో ఒకటి, ఎంప్రెస్ యూజీనీ కిరీటం డ్యామేజ్ అయి మ్యూజియం బయట దొరికినట్లు తెలుస్తోంది. ఈ మ్యూజియానికి సందర్శకుల తాకిడి ఎక్కువే. అయినా అంత సెక్యూరిటీ నడుమ జరిగిన దోపిడీ భద్రతా లోపాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.

Advertisment
తాజా కథనాలు