న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్‌గా గోదావరి మహిళ

రాజమండ్రి సుస్మిత సోమిరెడ్డి మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న సుస్మిత ఇటీవల న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచింది.

New Update
Sushmitha Sobhireddy

ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన అందాల పోటీల్లో ఏపీకి చెందిన ఓ మహిళ కిరీటాన్ని సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని రాజమండ్రికి చెందిన సోమిరెడ్డి సుస్మిత(38) అనే మహిళ రాష్ట్ర స్థాయిలో జరిగిన మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్‌గా కిరీటాన్ని గెలుచుకుంది. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో డిసెంబర్ 1న జరిగిన మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్ పోటీలో కిరీటం అందుకుంది. 

ఇది కూడా చూడండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ..

సుస్మిత రాజమండ్రిలోని బాలవిజ్ఞాన మందిర్ స్కూల్‌లో పదో తరగతి చదివింది. ఆ తర్వాత గెయిట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసింది. పెళ్లి కావడం, భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడంతో 2014లో న్యూయార్క్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం.

ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

స్కూల్, కాలేజీ, ఆఫీసులో జరిగే కార్యక్రమాల్లో డ్యాన్స్ సుస్మిత డ్యాన్స్ వేసేది. అయితే ఇప్పుడే కాదు.. గతేడాది మిసెస్ భారత్ పోటీకి కూడా ఎంపికైంది. కానీ అనారోగ్య కారణాల వల్ల వెళ్లలేదట. ఈసారి భర్త ప్రోత్సాహంతోనే ఈ పోటీలో కిరీటం సాధించారని ఆమె చెబుతోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే దేనినైనా సాధించవచ్చని సుస్మిత అంటున్నారు. 

ఇది కూడా చూడండి:  రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?

గోదావరిలో పుట్టిన సుస్మిత ఎక్కడో న్యూయార్క్‌లో జరిగిన పోటీల్లో గెలవడమంటే చాలా పెద్ద విషయం. కేవలం అందం అనే కాకుండా ర్యాంప్ వాక్, టాలెంట్, కాస్ట్యూమ్స్‌లో అదరొగొట్టింది. అలాగే ప్రశ్నలకు కూడా తనదైన రీతితో జవాబులు ఇచ్చింది. గృహహింస, స్వేచ్ఛ వంటి అంశాలపై జవాబులు ఇచ్చి సుస్మిత కిరీటాన్ని తన సొంతం చేసుకుంది. 

ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు