Hezbollah Pagers : హెజ్‌బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం! పేజర్లను వాడితే ఇజ్రాయెల్ కు దొరక్కుండా ఉండొచ్చని హెజ్‌బొల్లా వ్యూహకర్తల ప్లాన్. చాలా కాలం నుంచి వీటిని ఉపయోగిస్తున్నారు.తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్ లో దాదాపు 3,000 పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది. By Bhavana 18 Sep 2024 | నవీకరించబడింది పై 18 Sep 2024 12:22 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hezbollah Pagers : లెబనాన్ (Lebanon) లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇజ్రాయెల్ తో యుద్దానికి కాలు దువ్వుతున్న ఆ సంస్థకు ఇది ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అని తెలుస్తుంది. అసలు దాడి ఎలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ ఏర్పడింది. సైనిక నిపుణులు మాత్రం పక్కా ప్లానింగ్ తో జరిగిన ఆపరేషన్ అని కచ్చితంగా చెబుతున్నారు. Also Read : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్..ఎంతో తెలుసా! Mossad Seath Message హెజ్‌బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు. తైవాన్ కు చెందిన ఓ సంస్థ పరికరాలను ఇజ్రాయెల్ దీనికోసం వాడినట్లు అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. సాధారణంగా పేజర్లను వాడితే ఇజ్రాయెల్ కు దొరక్కుండా ఉండొచ్చని హెజ్‌బొల్లా వ్యూహకర్తల ప్లాన్…ఎప్పటి నుంచో కీలక సందేశాలను పంపడానికి వీటినే ఉపయోగిస్తుంది. ఇటీవల తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్ లో దాదాపు 3, 000 పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది. వాటిలో అత్యధికంగా ఆ కంపెనీకి చెందిన పీ 924 మోడల్ వే ఉన్నాయి. దీంతో పాటు మరో మూడు మోడల్స్ కూడా ఆ షిప్ మెంట్ లో ఉన్నాయి. పేలుళ్లను చూసిన నిపుణులు కేవలం బ్యాటరీ వల్లే ఆ స్థాయిలో గాయపడరని తెలిపారు. హెజ్‌బొల్లాకు సరఫరా చేసిన పేజర్లలో దాదాపు రెండు ఔన్సుల మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చే అవకాశం ఉందని యూరోపోల్ కు సైబర్ అడ్వైజర్ మిక్కో హైపోనూన్ వెల్లడించారు. ఇజ్రాయెల్ (Israel) నిఘా సంస్థలు చొరబడి వీటిని అమర్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Also Read : ఏలూరు జిల్లాలో దారుణం.. హాస్టల్ విద్యార్థునులపై అత్యాచారం! #israel #hezbollah సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి