హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఆ దేశ రాజధాని బీరుట్‌పై క్షిపణులు ప్రయోగించడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అలాగే మరో 90 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ వరుస దాడులకు హెజ్‌బొల్లా సైతం ప్రతీకార దాడులకు దిగింది. టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఉద్రిక్తతలు మరింత చెలరేగాయి. అయితే ఈ క్షిపణులను అడ్డుకున్నామని.. వీటికి సరైన బదులు ఇస్తామని కూడా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేసింది.
Also read: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ఇదిలాఉండగా.. ఇటీవల లెబనాన్‌లో వాకీటాకీలు, పేజర్ల పేలుళ్లు జరిగి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లకు ఇజ్రాయెలే కారణమని లెబనాన్ వర్గాలు కూడా ఆరోపించాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ బీరుట్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఓవైపు పేజర్లు, వాకీటాకీల పెలిపోవడం, మరోవైపు హెజ్‌బొల్లా అగ్రశ్రేణి కమాండర్లతో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి. బుధవారం లెబనాన్‌పై జరిపిన కాల్పుల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 223 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. గత రెండు రోజుల్లో మొత్తం 564 మంది ప్రాణాలు కోల్పోగా.. 1800 మందికి గాయాలయ్యారు. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఉత్తర ప్రాంతంలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. శుక్రవారం లెబనాన్‌లోని హఫియా నుంచి 10 రాకెట్లను ప్రయోగించారు. అందులో కొన్ని రాకెట్లను అడ్డుకున్నామని.. మరికొన్ని పలు ప్రాంతాల్లో పేలిపోయినట్లు ఇజ్రాయెల్ భద్రతా దళం వెల్లడించింది. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ లెబనాన్‌లో ఉంటున్న పౌరులను భారత్ అప్రమత్తం చేసింది. వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది.
Also Read: భారత్‌లో ఫేమస్ విదేశీ పోర్న్ స్టార్ అరెస్ట్