టూత్ పేస్ట్ కొంటే ఉద్యోగం ఊస్ట్.. ఎంప్లాయీస్ కు మెటా ఊహించని షాక్!

ఉచిత భోజన వోచర్లను దుర్వినియోగం చేసినందుకు మెటా కంపెనీ 24 మంది ఉద్యోగులను తొలగించింది. లాస్ ఏంజిల్స్ లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత భోజన వోచర్లలో కొందరు టూత్ పేస్ట్, వైన్ గ్లాసెస్, లాండ్రీ డిటర్జెంట్ కొనుక్కున్నందుకు తొలగించింది.

Meta company
New Update

టూత్ పేస్ట్ కొంటే ఉద్యోగం ఊడిపోయిన వ్యవహారం ఎక్కడైనా చూశారా?. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మంది ఉద్యోగాలు కోల్పోయారు. టూత్ పేస్ట్, వైన్ గ్లాసెస్ వంటి వస్తువులు కొన్నందుకు ప్రముఖ కంపెనీ మెటా తమ ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించింది. అదేంటి టూత్ పేస్ట్ సహా ఇతర వస్తువులు కొంటే మెటా ఎందుకు తమ ఉద్యోగులను ఊడపీకేసింది అని అనుకుంటున్నారా?.. దానికీ ఓ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!

ఉచిత భోజనం కోసం వోచర్లు

మార్క్ జూకర్ బర్గ్ యాజమాన్యంలోని ప్రముఖ టెక్ కంపెనీ మెటా .. లాస్ ఏంజిల్స్ లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎప్పటికప్పుడు ఉచిత ప్రోత్సహకాలు అందిస్తోంది. తమ ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మెటా తరచూ ఉచిత భోజనం కోసం వోచర్లు అందిస్తుంది. తమ ఉద్యోగులు మూడు పూటలు తినేందుకు ఈ వోచర్లు ఉపయోగపడతాయి. 

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

24 మంది ఉద్యోగం ఊస్ట్

ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా.. కంపెనీ అందించిన ఈ ఉచిత వోచర్లతో మూడు పూటలు ఫుడ్ తినొచ్చు. అయితే ఆ వోచర్లను కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు కంపెనీ గుర్తించింది. దీని కారణంగానే 24 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. మెటా ఉద్యోగులకు ఇచ్చిన ఫ్రీ ఫుడ్ వోచర్లను వారు భోజనానికి బదులుగా ఇతర వస్తువులను కొనుగోలు చేశారు.

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

వీక్ ఆఫ్ రోజుల్లోనూ వేరే వస్తువులు కొనడం

టూత్ పేస్ట్, వైన్ గ్లాసెస్, లాండ్రీ డిటర్జెంట్ వంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వోచర్లను వారు ఉపయోగించారు. అంతేకాకుండా ఉద్యోగాలు కోల్పోయిన కొందరు వీక్ ఆఫ్ రోజుల్లోనూ ఫ్రీ ఫుడ్ వోచర్లను వేరే వస్తువులు కొనడానికి ఉపయోగించినట్లు సంస్థ గుర్తించింది. అందువల్లనే వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. 

ఇది కూడా చదవండి: భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి!

కాగా కంపెనీ గ్రూబ్ హబ్, ఉబర్ ఈట్స్ వంటి ఫుడ్ డెలివరీ సేవల ద్వారా తమ ఉద్యోగులకు ఆర్డర్ చేయడానికి ప్రతిరోజూ భోజన వసతి అందిస్తుంది. ఇందులో భాగంగానే ఒక ఉద్యోగికి టిఫిన్ కోసం 20 డాలర్లు (రూ.1,681).. మధ్యాహ్నం భోజనం కోసం 25 డాలర్లు (రూ.2,100).. అలాగే రాత్రి డిన్నర్ కోసం 25 డాలర్లు (రూ.2,100) విలువ చేసే వోచర్లు అందిస్తుంది. వీటిని మెటా ఉద్యోగులు దుర్వినియోగం చేసుకోవడంతో పాటు మరికొందరు జాబ్ కి రాని సమయంలోనూ ఆ వోచర్లన్లు ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. 

#viral-news #meta-company
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe