చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!

TG: కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్ చిక్కుల్లోకి నెడుతోంది. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్ట్ పై కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. కేసీఆర్ చెప్పినట్టే తాము ప్రాజెక్ట్ నిర్మించామని ఆయన తెలిపారు.

New Update
కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయడానికి కారణాలేంటి.. వ్యూహమా? భయమా?

Kaleshwaram Project: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాజీ సీఎం కేసీఆర్ మెడకు ఉచ్చు లాగా చుట్టుకుంటోంది. తాజాగా ఈ కాళేశ్వరంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ జరిపిన విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కేసీఆర్ పై కీలక ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 

అంతా కేసీఆరే చేశారు...!

గతంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్ట్ నిర్మాణాలకు కావాల్సిన స్థానాలపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా వ్యాప్కోస్ తయారు చేసిన కాళేశ్వరం డీపీఆర్ ను ప్రభుత్వం ఆమోదించిందని, ఆనాడు సీఎంగా కేసీఆర్ అనుమతి ఇస్తూ సంతకం చేశారని విచారణ కమిషన్ ఎదుట చెప్పారు. నిర్మాణం చేపట్టే క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను కేసీఆరే మార్చమన్నట్లు తెలిపారు. 

NEWS IS BEING UPDATED...

Advertisment
తాజా కథనాలు