వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. ఏం కనిపెట్టారంటే ?

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్క్రిప్షనల్ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపెట్టినందుకు ఈ పురస్కారం వరించింది.

Nobel
New Update

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్క్రిప్షనల్ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపిట్టినందుకు ఈ పురస్కారం వరించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరి అమెరికన్ కాటలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్‌లకు గత ఏడాది వైద్యశాస్త్ర రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. మొత్తం 227 మంది ఈ పురస్కారాలను అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 

Also Read: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే!

వైద్యశాస్త్ర విభాగంతో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల కార్యక్రమం అక్టోబర్ 14 వరకు జరగనుంది. ఇక మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటించనున్నారు. ఇక శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయనున్నారు. చివరగా అక్టోబర్ 14న అర్ధశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడిస్తారు. 

స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుపొందిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ నోబెల్ బహుమతులను ప్రధానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్టులను ప్రతీ ఏడాది అందజేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్ల) నగదు అందుతుంది. అంటే మన కరెన్సీలో రూ.8 కోట్ల 39 లక్షలు. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. 

Also Read: షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?

#telugu-news #international-news #nobel-prize
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe