Karachi : కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది.
Also Read: ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్!
విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ చెప్పారు.
Also Read: షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?
ముఖ్యంగా చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. బీజింగ్ చేపట్టిన రహదారుల నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ పేలుడులో పోలీసు అధికారులు కూడా గాయపడినట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనర్ ఈస్ట్ అజ్పర్ మహేసర్ మీడియాకి వివరించారు.
Also Read: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!
ట్యాంకర్ పేలడం వల్ల ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు జరిగినట్లు పౌర విమానాయన శాఖ పని చేస్తున్న అధికారులు వివరించారు.
Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!