Karachi: విమానాశ్రయం వద్ద పేలుడు..ఇద్దరు మృతి! కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. By Bhavana 07 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Karachi : కరాచీ విమానాశ్రయం బయట బాంబు పేలుడు జరిగింది.ఈ భారీ పేలుడు వల్ల ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పది మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. Also Read: ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్! విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పాక్ హోం మంత్రి జియా ఉల్ హసన్ చెప్పారు. Also Read: షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే? ముఖ్యంగా చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. బీజింగ్ చేపట్టిన రహదారుల నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ పేలుడులో పోలీసు అధికారులు కూడా గాయపడినట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనర్ ఈస్ట్ అజ్పర్ మహేసర్ మీడియాకి వివరించారు. Also Read: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు! ట్యాంకర్ పేలడం వల్ల ఎయిర్‌పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు జరిగినట్లు పౌర విమానాయన శాఖ పని చేస్తున్న అధికారులు వివరించారు. Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..! #bomb-blast #karachi-airport మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి