Zuckerberg బైడెన్‌ ప్రభుత్వం బాగా ఒత్తిడి తీసుకొచ్చింది!

జో బైడెన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కొవిడ్‌ సమయంలో వ్యాక్సి్‌ దుష్ప్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందన్నారు.

New Update
America-Hamas: అమెరికాకు హమాస్‌ వార్నింగ్‌...త్వరలోనే ప్రతిఫలం ఉంటుంది!

జో బైడెన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కొవిడ్‌ సమయంలో వ్యాక్సి్‌ దుష్ప్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందన్నారు. ద జో రోగన్‌ ఎక్స్‌పీరియన్స్‌ పాడ్‌ కాస్ట్‌ లో పాల్గొన్న ఆయన ఈ మేరకు స్పందించారు.

Also Read: Injections: ఈ ఇంజెక్షన్లతో కిడ్నీలో రాళ్లు..దూరంగా ఉంటే బెటర్

బైడెన్‌ ప్రభుత్వం కొవిడ్‌ టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. వ్యక్తిగతంగా నేను టీకాలకు అనుకూలంగా ఉంటాను. వాటివల్ల ప్రతికూలత కంటే సానుకూల ఫలితాలే ఉంటాయి. అయితే కొవిడ్‌ టీకాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో వాటి గురించి వినిపించిన వాదనలను సెన్సార్‌ చేయడానికి ప్రయత్నించారని నేను అనుకున్నాను.

Also Read: పేదలకు చేయూత.. సంక్రాంతి పండక్కి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

వ్యాక్సిన్‌ లతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని చెప్పే పోస్టులన్నీ తీసేయాలని, తన సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరంగా పరిగణించిన కంటెంట్‌ను సెన్సార్‌ చేయాలని వైట్‌ హౌస్‌ సిబ్బంది నుంచి ఒత్తిడి వచ్చింది. అందంతా హాస్యాస్పదంగా ఉండటమే కాక, అలా చేయకూడదని నాకు అనిపించేది అని జుకర్‌ బర్గ్‌ తెలిపారు.

టైటానిక్‌ నటుడు లియోనార్డో డికాప్రియో పై వచ్చిన మీమ్‌ కూడా వారు తీసేయమన్న పోస్టుల్లో ఒకటని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలతో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు పరిహారం పొందుతారేమో అన్నట్లుగా ఉన్న ఆ మీమ్‌ వైరల్ అయ్యింది.ఇదిలా ఉంటే నకిలీ, హానికర సమాచార వ్యాప్తి కట్టడి కోసం అనుసరిస్తోన్న సెన్సార్‌షిప్ విధానాల్లో మెటా మార్పులు చేసినట్లు ఇటీవల జుకర్‌ బర్గ్‌ ప్రకటించారు. సెన్సార్‌ షిప్‌ అధిక స్థాయిలో ఉన్న పరిస్థితికి చేరుకున్నాం. 

ప్రస్తుతం మేం మా తప్పులను తగ్గించుకోవడం పై దృష్టి పెడతాం. మా విధానాలను సరళీకరించి, మా ప్లాట్‌ఫాంలలో స్వేచ్ఛ ,భావ వ్యక్తీకరణను పునరుద్దరించే దిశగా చర్యలు తీసుకుంటాం అని జుకర్‌ బర్గ్‌ ఓ వీడియో విడుదల చేశారు. జుకర్‌ బర్గ్‌ ప్రకటన వెలువడగానే ట్రంప్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సానుకూలంగా స్పందించారు.

Also Read: Game Changer: 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ

Also Read: RajaSaab: సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు