Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అంకితం చేస్తున్నా.. మరియా కొరీనా కీలక ప్రకటన

నోబెల్ శాంతి బహుమతి గ్రహిత మరియా కొరీనా తన సోషల్ మీడియా ఖాతాలో కీలక ప్రకటన చేశారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతో సహా తమ ఉద్యమానికి సపోర్ట్‌గా ఉంటున్న ట్రంప్‌కు ఈ బహుమతిని అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు.

New Update
Maria Corina Machado Dedicates Nobel Peace Prize To Donald Trump

Maria Corina Machado Dedicates Nobel Peace Prize To Donald Trump

ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మాచాడోకు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ బహుమతి కోసం ఆరాటపడినప్పటికీ ఆయనకు దక్కలేదు. అయితే తాజాగా మరియా కొరీనా తన సోషల్ మీడియా ఖాతాలో కీలక ప్రకటన చేశారు. ఈ పురస్కారాన్ని వెనెజువెలా ప్రజలతో సహా తమ ఉద్యమానికి సపోర్ట్‌గా ఉంటున్న ట్రంప్‌కు ఈ బహుమతిని అంకితం చేస్తున్నానని రాసుకొచ్చారు.   

Also Read: మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి రావాడానికి కారణం ఇదే.. ఆమె ఏం చేసిందో తెలుసా ?

'' వెనెజువెల ప్రజలు పడుతున్న కష్టాలు గుర్తించడం మా పోరాటాన్ని ముగించేందుకు ఊతమిస్తుంది. స్వేచ్ఛకు దోహదపడుతుంది. మేము విజయానికి చేరువలో ఉన్నాం. గతంలో ఎప్పడూ లేనంతగా ట్రంప్, అమెరికా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలపై ఆధారపడుతాం. ప్రజాస్వామ్య దేశాలు మాకు ప్రధాన మిత్ర దేశాలు. ఈ పురస్కారాన్ని కష్టాల్లో ఉన్న వెనెజువెల ప్రజలతో సహా మా మా పోరాటానికి సపోర్ట్ చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ నోబెల్ బహుమతిని అంకితం చేస్తున్నానని'' మరియా తెలిపారు.  

Also Read: ఇజ్రాయెల్-హమాస్ శాంతి ఒప్పందం.. యుద్ధం ముగిసినట్లేనా ?

Advertisment
తాజా కథనాలు