Canada: కెనడాకు కొత్త ప్రధానమంత్రి !

కెనడాకు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ రెడీ అయిపోయింది. మార్చి 9న పార్టీలో ఓటింగ్‌ నిర్వహించనుంది. అయితే ఈ రేసులో నలుగురు ఉన్నారు. మార్క్‌ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్‌, ఫ్రాంక్ బేలిస్‌లు పోటీ పడుతున్నారు.

New Update
Justin Trudo

Justin Trudo

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెనడాకు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ రెడీ అయిపోయింది. మార్చి 9న పార్టీలో ఓటింగ్‌ నిర్వహించనుంది. అయితే ఈ రేసులో నలుగురు ఉన్నారు. అమెరికా కెనడాపై 25 శాతం టారీఫ్‌ విధించిన వేళ.. కెనడా నూతన ప్రధాని ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.   

లిబరల్‌ పార్టీ రేసులో మార్క్‌ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్‌, ఫ్రాంక్ బేలిస్‌లు ఉన్నారు. అయితే వీళ్లలో మార్క్‌ కార్నీ, ఫ్రీలాండ్‌ల మధ్య తీవ్రంగా పోటీ ఉంది. అయినప్పటికీ మార్క్‌ కార్నీ కెనడాకు నూతన ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్‌.. బ్యాంక్ ఆఫ్‌ కెనడాకు మాజీ గవర్నర్‌గా పనిచేశారు. అంతకుముదు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు కూడా గవర్నర్‌గా పనిచేశారు. మరోవైపు జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో క్రిస్టియా ఫ్రీలాండ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాసిన లేఖ.. ట్రుడ రాజీనామాకు దారితీసిందనే వాదనలు కూడా వచ్చాయి.  

ఇదిలాఉండగా..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి కెనడా సుంకాల సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో కెనడా కొత్త ప్రధాని ఎవరు అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీటిని ఎదుర్కొనేందుకు తమవద్ద ప్లాన్స్‌ ఉన్నాయని లిబరల్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సీక్రెట్‌ ఓటింగ్ ద్వారా కెనడా ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఇందులో సుమారు 1.40 లక్షల మంది ఓటర్లు పాల్గొననున్నారు. మొత్తానికి కెనడాకు కొత్త ప్రధాని ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు